రైతులకు ఆ గౌరవం మళ్లీ దక్కుతోంది..!

వ్యాపారంలో నష్ట వస్తే కంపెనీ మూసేస్తారు. కానీ వ్యవసాయంలో నష్టం వస్తే..రైతన్న మళ్లీ వ్యవసాయమే చేస్తాడు. లాభం కోసం చేసేది వ్యాపారమైతే.. సమాజం కోసం చేసేది వ్యవసాయం. అందుకే రైతన్న పట్టిన కాడి వదలడు.

పంట చేతికి వస్తుందా..? రాదా..? అనే అనుమానం లేకుండా భూమి తల్లిపై భారం వేసి, విశ్వాసంతో వ్యవసాయం చేస్తారు. పంట వచ్చినా.. రాకున్నా.. పెట్టుబడి తప్పుదు. ఏ రైతుకు ప్రతి ఏడాది ఆదాయం వచ్చిన దాఖలాలు చరిత్రలో లేదు. ఒక ఏడాది నాలుగు రూపాయలు మిగిలితే.. మరుసటి ఏడాది ఆరు రూపాయలు నష్టం. ఒక పంటలో ఆదాయం వస్తే.. మరో పంటలో నష్టం. అందరికీ అన్నం పెట్టే రైతన్న జీవన ప్రయాణం ఇలా సాగుతుంది. ఈ క్రమంలో అప్పుల పాలవ్వడం సర్వసాధారణం. ప్రాణం కన్నా పరువుకే రైతన్న విలువ ఇస్తాడు. ఉన్న పొలం విక్రయించి అప్పులు తీరుస్తాడు. ఆ దారి లేకపోతే ప్రాణం తీసుకుంటున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం

పరువు కోసం ప్రాణాలు తీసుకునే రైతన్నలు దాదాపు ఐదేళ్ల పాటు బ్యాంకుల వైపు వెళ్లలేకపోయారు. గౌరవంగా చూసే బ్యాంకు అధికారుల కళ్లలో మార్పు, అప్పు ఎగవేతదారులమనే భావన, అప్పులు చెల్లించాలనే నోటీసులతో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని ఐదేళ్లు రైతులు మానసికంగా నలిగిపోయారు. 87,672 కోట్ల రూపాయల వ్యవసాయ, బంగారు రుణాలు భేషరుతగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిన బాబు వల్ల రైతులకు ఈ పరిస్థితి వచ్చిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం సమూలంగా మార్చివేసింది. రైతన్నలు మళ్లీ బ్యాంకుల వైపు తలెత్తుకుని వెళ్లేలా వైఎస్‌ జగన్‌ దారి వేశారు. బ్యాంకులు అన్నదాతలను గౌరవంగా చూసే రోజులు మళ్లీ వచ్చాయి. మునుపటి కన్నా వేగంగా రుణాలు వస్తున్నాయి. రైతుల కోసం ఎంత చేసినా తక్కువే అంటూ వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు, తీసుకున్న విధానపరమైన నిర్ణయాలతో వ్యవసాయం, రైతుల ముఖ చిత్రమే మారిపోయింది.

రైతులకు మేలు చేసేలా.. అదే సమయంలో బ్యాంకుల లావాదేవీలకు ఆటంకం కలగకుండా ఉండేలా సీఎం జగన్‌ అమలు చేస్తున్న పథకాలు ఉపయోగపడుతున్నాయి. తాజాగా ప్రారంభించిన వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకంతో.. రైతులకు వడ్డీ లేకుండానే లక్ష రూపాయల రుణం లభిస్తోంది. ఏడాది లోపు రుణం చెల్లిస్తేనే ఈ పథకం వర్తిస్తుండడంతో.. ఆ లోపు రైతులు తీసుకున్న రుణాలను చెల్లిస్తున్నారు. ఈ పథకం వల్ల రైతులకు రుణ పరపతి లభిస్తోంది. అదే సమయంలో బ్యాంకుల ఎన్‌పీఏలు తగ్గుతున్నాయి. 2019 ఖరీఫ్‌లో తీసుకున్న రుణాలు తిరిగి ఏడాదిలో చెల్లించిన వారికి సున్నా వడ్డీ పథకం వర్తించేలా తాజాగా జగన్‌ ప్రభుత్వం 510 కోట్ల రూపాయలను సున్నా వడ్డీ కోసం విడుదల చేసి అన్నదాతలకు అండగా తానున్నాననే ధైర్యాన్ని ఇచ్చింది.

Show comments