విశేష అధికారాలను ఉపయోగించటంలో మండలి చైర్మన్ షరీఫ్ నిబందనలు మరిచారా ?

పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సి.ఆర్.డి.ఏ రద్దు బిల్లు రెండూ అసెంబ్లీలో సునాయాసంగా ఆమోదం పొందినా , మండలిలో తెలుగుదేశంకు బలం ఉండటంతో ఈ బిల్లు ఆమోదం పొందుతాయా లేదా అని ఉదయం నుండి రాజకీయ వర్గాలతో పాటు రాష్ట్ర ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు, గంటల తరబడి సాగిన చర్చ, వాదోపవాదాల తరువాత మండలి చైర్మన్ షరీఫ్ తనకి ఉన్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి పరిపాలన వికేంద్రికరణ బిల్లుని, సి.ఆర్.డి.ఏ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్టు తెలిపి సభను నిరవధిక వాయిదా వేశారు.

అయితే ఇక్కడ మండలి చైర్మన్ చేసిన వాఖ్యలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. షరీఫ్ మాట్లాడుతూ నేను తీసుకున్న నిర్ణయం నిబందనలకు వ్యతిరేకంగా ఉన్నా, నాకు ఉన్న విశేష అధికారాలను ఉపయోగంచి తీసుకున్నాను అని చెప్పుకొచ్చారు , నిజానికి చైర్మన్ షరీఫ్ చెప్పినట్టు నిబందనలకు విరుద్ధంగా విశేష అధికారాలను ఉపయోగించి నిర్ణయం తీసుకోవటానికి కొన్ని నిబందనలు ఉన్నాయి. ఎక్కడైతో రూల్ లేదో, లేదా ఎక్కడైన రూల్స్ లో సందిగ్దత ఉంటే అప్పుడు మాత్రమే మండలి చైర్మన్ కు విశేష అధికారాలను ఉపయోగించే వెసులుబాటు ఉంది . కానీ నేడు మండలిలో నిర్ధిష్టమైన నిబందనలు ఉన్నప్పటికి కూడా వాటికి వ్యతిరేకంగా విశేష అధికారాలను ఉపయోగించి చైర్మన్ తన నిర్ణయాలను తెలియ చేయటం రాజ్యంగ విరుద్ధం అనే వాదన ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తుంది.

అలాగే లోక్ సభ రూల్ 108 ప్రకారం కౌన్సిల్ తాలూకు నిర్ణయాలు కానీ , తీర్మానాలు కానీ అసెంబ్లీ ఆమోదించొచ్చు లేక ఆమోదించకపొవచ్చు, మండలి తాలుకు నిర్ణయాలను మేము ఆమోదించటంలేదు, మా మొదటి డ్రాఫ్టే చెల్లుబాటు అవుతుంది అనే తీర్మాణం ని అసెంబ్లీ తీసుకుని ఆ తీర్మానంని తిరిగి కౌన్సిల్ కి పంపే నియమం కూడా ఉంది అని నిపుణులు చెబుతున్నారు. ఇవ్వన్ని పరిశీలించి చూస్తే తెలుగుదేశం మండలిలో చేసిన ఈ పనికి ప్రతిఫలం దక్కేట్టుగా లేదనే వాదన కూడా ఉంది.

Show comments