Idream media
Idream media
ఈ నెల 7వతేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద ఉన్న శాఖలను అసెంబ్లీ సమావేశాలు జరిగే వరకూ ఇతర మంత్రులకు కేటాయించారు. ఈ మేరకు ఏ ఏ శాఖలను ఎవరెవరికి కేటాయించారో తెలుపుతూ అసెంబ్లీ కార్యదర్శికి సమాచారం పంపారు.
మొత్తం 9 శాఖలను సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరుగురు మంత్రులకు తాత్కాలికంగా కేటాయించారు. సాధారణ పరిపాలన శాఖను వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుకు కేటాయించారు. లా అండ్ ఆర్డర్‌ను హోం మంత్రి మేకతోటి సుచరితకు, లా అండ్ జస్టిస్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు అప్పజెప్పారు.
మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు మూడు శాఖలు కేటాయించారు. ఐటీ, వాణిజ్యం – పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి – శిక్షణ శాఖలను అప్పగించారు. ఎన్‌ఆర్‌ఐ ఎంపవర్‌మెంట్స్ – రిలేషన్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ శాఖను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కేటాయించారు.