ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అధికారం చేపట్టిన నాటి నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీఠ వేసి.. ఉద్యోగులను నిర్లక్ష్యం చేశారని కొందరు అభిప్రాయ పడ్డారు. అలానే ఉద్యోగుల్లో పూర్తి స్థాయిలో కాకపోయినా.. కొంత అసంతృప్తి ఉన్నదనే వాస్తవం. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగులను సంతృప్తి పరిచేందుకు ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అలానే తాజాగా ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో శుభవార్త తెలిపింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
గత కేబినెట్ లో ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కొన్ని కీలక అంశాలపై గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ, సీపీఎస్ రద్దు వంటి విషయాలపై కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాక హెచ్ఆర్ఏ పెంపుపైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటికి కొనసాగింపుగా ఇవాళ మరిన్ని అంశాల్లో వారికి ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంది. ప్రతినెలా మూడో శుక్రవారం గ్రీవెన్సు డే ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కలెక్టర్లు, వివిధ శాఖ అధిపతుకు వ్యక్తిగతంగా ఉద్యోగులు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘జగనన్నకు చెబుదాం’ ద్వారా వీరి సమస్యలు పరిష్కరించేలా జగన్ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. అదే విధంగా రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ప్రస్తుతం కొనసాగుతున్న ఐదు రోజుల పనిదినాల విధానాన్ని కూడా మరికొన్ని రోజులకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సచివాలయాల, హెచ్ఓడి, ఇతర విభాగాల్లో పని చేసే వారికి వారానికి ఐదు రోజులు పని దినాలు కొనసాగించేలా జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో పాటు వివిధ ప్రభుత్వ ఆఫీస్ లో పని చేస్తున్న ఉద్యోగులకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకు పనివేళలు ఉండేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఎన్నికలకు 9 నెలల సమయమే ఉన్న నేపథ్యంలో ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని దాదాపుగా తొలగించాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల్ని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. దీంతో అధికారులు కూడా ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ గవర్నమెంట్ కు నివేదికలు ఇస్తున్నారు. మరి.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.