ఏపీ కేబినెట్‌ తీర్మానాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం ముగిసింది. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐదు అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో 13 జిల్లాల్లో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Read Also: ఏపీ కేబినెట్‌ భేటీ ప్రారంభం.. ఏం జరుగుతోందంటే…

సీఆర్‌డీఏ రద్దు చేసి దాని స్థానంలో అమరావతి మెట్రో రిజియన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 11 వేల రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కౌలు రౌతులకు ఇచ్చే పరిహారం 2500 రూపాయల నుంచి 5 వేలకు పెంపుకు నిర్ణయం. నాలుగు ప్రాంతీయ కమిషనరేట్ల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించారు.

కాగా మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే బీఏసీ సమావేశానికి సీఎం వైఎస్‌ జగన్‌ వెళ్లారు. మూడు రోజులపాటు జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఏ రోజు ఏ అంశాలు చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటారు.

Show comments