Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏదీ కలిసొచ్చేలా కనిపించడం లేదు. తన సుధీర్ఘ రాజకీయ అనుభవాన్నంతా రంగరించి ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి వెనక్కే వెళ్లిపోతున్నాయి. జగన్ ను ఎదుర్కోవడం ఇంత కష్టమవుతుందని బహుశా ఆయన ఊహించి ఉండరు. స్థానికంగా ఆయనను ఢీ కొట్టలేక కేంద్రంతో దోస్తీ ద్వారా జగన్ కు చెక్ పెట్టాలన్నా వ్యూహాలు కూడా ఫలించే అవకాశాలు లేవు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉండగా.. చంద్రబాబును బీజేపీ దరిదాపులకు కూడా చేరనిచ్చేలా కనిపించడం లేదు. చంద్రబాబు టార్గెట్ గా సోము చేస్తున్న ప్రసంగాల ద్వారా అది స్పష్టం అవుతోంది. బీజేపీకి దగ్గరయ్యేందుకు బాబు చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతూనే ఉన్నాయి. తిరుపతి ఉప ఎన్నికను అడ్డుపెట్టుకుని బాబు చేస్తున్న రాజకీయాలు కూడా సాగేటట్లు కనిపించడం లేదు.
అప్పుడు ప్రశంలు కురిపించినా.. పట్టించుకోలేదు..
ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో కేంద్రాన్ని కాంగ్రెస్ తో కలిసి గతంలో తప్పుబట్టారు.. చంద్రబాబు నాయుడు. గతంలో కేంద్రంతో పాటు మూడున్నరేళ్ల పాటు అధికారం పంచుకున్న టీడీపీ.. ప్రత్యేక హోదా పేరుతో ఆ తర్వాత బయటికొచ్చేసిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా ధర్మ పోరాటం అంటూ బీజేపీ, ఎన్డీయేపై నిరసన ప్రారంభించింది. ఇందుకు కాంగ్రెస్ సాయం కూడా తీసుకుంది. సరిగ్గా ఆ సమయంలోనే రాఫెల్ జెట్లును కొనుగోలు చేసేందుకు ఎన్డీయే సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీన్ని కేంద్రంలో విపక్ష కాంగ్రెస్ కుంభకోణంగా పేర్కొంటూ రచ్చరచ్చ చేస్తోంది. ఇదే అదనుగా కాంగ్రెస్ వాదన అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో స్కామ్ చేస్తోందని ఆరోపించారు. గత నెలలో ఫ్రాన్స్ నుంచి వచ్చిన రాఫెల్ జెట్లను దేశం గర్వించదగిన యుద్ధ విమానాలు అంటూ చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. మోదీ నిర్ణయం చారిత్రాత్మకం అంటూ ప్రశంసలు కురిపించారు. అసలే ఏపీలో బలపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నేతలు ఇదే అదునుగా చంద్రబాబును ఆడుకోవడం మొదలుపెట్టేశారు. యూ టర్న్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు, ఇంకెన్నాళ్లు బాబు అంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ట్విట్టర్‌లో చంద్రబాబును ప్రశ్నించారు. అలాగే తిరుపతి ఉప ఎన్నికను అడ్డుపెట్టుకుని మరోసారి బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అక్కడ బీజేపీకి సపోర్ట్ చేస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రచారం చేసి బీజేపీ పెద్దలు మెప్పు పొందేందుకు బాబు ప్రయత్నిస్తున్నారన్న వాదన ఉంది.
వాడుకుని వదిలేస్తారంటున్న సోము
అవకాశం దొరికినప్పుడల్లా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన గత రాజకీయాల్లోని తప్పటడుగులను గుర్తు చేస్తూ గురి చూసి కొడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ప్రభుత్వ విప్ గద్దె బాబూరావు శనివారం బీజేపీలో చేరారు. ఆ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబుపై సోము ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు ఎవ్వరినైనా వాడుకుని వదిలేస్తారని అన్నారు. ‘గత ఎన్నికల్లో తనకు అనుకూలమైన వ్యక్తులకు సీటివ్వలేదని పోత్తును వదులుకున్నటు చంద్రబాబు ప్రకటించాడు. మళ్లీ సాయంత్రమే కాళ్లబేరానికొచ్చాడు. చంద్రబాబు ఎన్టీఆర్‌ని వాడుకున్నాడు, మోసగించాడు, వెన్నుపోటు పొడిచాడు. రాష్ట్రంలో చంద్రబాబు ఏం చేయగలడు..? నిర్మాణమైన ప్రతిపక్ష పాత్రను కూడా సరిగా పోషించలేకపోతున్నారు.’ అని ఆరోపణలు చేశారు. బాబు వాడుకుని వదేలిస్తారన్న విషయాన్ని సోము పదే పదే గుర్తు చేయడం ద్వారా చంద్రబాబుతో కలవకూడదనే విషయాన్ని తమ పార్టీ దృష్టికి తీసుకెళ్లడమే వీర్రాజు వ్యూహంగా కనిపిస్తోంది.