iDreamPost
android-app
ios-app

జగన్‌కు భయపడ్డ చంద్రబాబు.. కుప్పం నుంచి నంద్యాలకు షిఫ్ట్‌!

  • Published Oct 17, 2023 | 2:48 PMUpdated Oct 17, 2023 | 2:48 PM
  • Published Oct 17, 2023 | 2:48 PMUpdated Oct 17, 2023 | 2:48 PM
జగన్‌కు భయపడ్డ చంద్రబాబు.. కుప్పం నుంచి నంద్యాలకు షిఫ్ట్‌!

కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడికి కంచుకోట. ఎన్నో ఏళ్లుగా ఆయన అక్కడ నుంచే పోటీ చేస్తున్నారు. కుప్పంలో గ్రామస్థాయి నుంచి అసెంబ్లీ వరకు ఏ ఎన్నికలు జరిగినా.. గెలుపు మాత్రం టీడీపీదే అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రానున్న ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో వైసీపీ విజయం సాధించలని లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం జగన్‌. దానిలో భాగంగా కుప్పం నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో  వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది.

దాంతో జగన్‌ కుప్పం మీద మరింత ఫోకస్‌ పెట్టారు. ఫలితం.. ప్రస్తుతం చంద్రబాబు రానున్న ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేయాలంటే భయపడే పరిస్థితి నెలకొని ఉందంట. అందుకే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు తన కంచుకోట కుప్పంను కాదని.. నంద్యాల నుంచి పోటీ చేయనున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇది చూసిన వైసీపీ నేతలు.. జగన్‌ దెబ్బకు భయపడి చంద్రబాబు నంద్యాల పారిపోతున్నాడంటూ ఎద్దేవా చేస్తున్నారు.

ప్రచారం సంగతి అలా ఉంచితే.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి కంటే.. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే.. కుప్పం అభివృద్ధి పథంలో ముందుకు నడించింది అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. జగన్‌ సీఎం అయిన తర్వాత కుప్పంను రెవిన్యూ డివిజన్‌గా మార్చారు. అలానే కుప్పం అభివృద్ధి పనుల కోసం సీఎం జగన్ రూ.66 కోట్లను మంజారు చేసారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. అంతేకాక మంత్రి పెద్దిరెడ్డికి ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. దాంతో కుప్పంలో టీడీపీ పట్టు తగ్గిందనేది వాస్తవం. పైగా గత ఎన్నికల్లోనే కుప్పంలో చంద్రబాబు మెజారిటీ చాలా వరకు తగ్గింది. ఇక అక్కడ దొంగ ఓట్ల దందా అనే అంశం మీద ఎప్పటి నుంచో ఉంది.

ప్రస్తుతం కుప్పంలో టీడీపీ కథ కంచికి చేరినట్లే కనిపిస్తుంటే.. వైసీపీ మాత్రం.. అక్కడ ఎలాగైనా సరే విజయం సాధించాలనే లక్ష్యంతో పట్టుపట్టి కూర్చుంది. ఈ క్రమంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుంచి కాకుండా.. నంద్యాల ఉంచి పోటీ చేస్తారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. ఒకవేళ ఈ ప్రచారం నిజమే అనుకున్నా.. నంద్యాలలో చంద్రబాబు గెలుస్తారా అంటే అనుమానమే. పైగా అక్కడ చంద్రబాబు సొంత కులం ప్రాబాల్యం కూడా పెద్దగా లేదు అంటున్నారు విశ్లేషకులు.

అంతేకాక ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు సొంత నియోజకవర్గానికి పెద్దగా చేసింది కూడా ఏం లేదు. అలాంటి వ్యక్తి నంద్యాలలో పోటీ చేస్తే జనాలు నమ్మరు అంటున్నారు. ప్రస్తుతం బాబు పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా మారింది అంటున్నారు. కుప్పంలో గెలుపు కష్టం.. వేరే చోట పోటీ చేస్తే జగన్‌కు భయపడినట్లే అనే టాక్‌ వినిపిస్తున్న నేపథ్యంలో.. నంద్యాలలో పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో.. జగన్‌ దెబ్బకు భయపడే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు వైసీపీ నేతలు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి