బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రస్తుతం ప్రెగ్నెంట్. ఇటీవలే అనుష్క ప్రెగ్నెన్సీ విషయాన్ని ఆమె భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీ అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. అనుష్క గురించి అందరికీ తెల్సిందే. ఆమె డేరింగ్ అండ్ డాషింగ్. ఎవరేం అనుకున్నా, తాను చెయ్యాలనుకున్నది చేసెయ్యగలదు. తాజాగా ఓ వెబ్ సిరీస్ కోసం అనుష్క శర్మని ఓ నిర్మాత సంప్రదించారట. తాము తీస్తున్నది ప్రెగ్నెన్సీ బ్యాక్‌డ్రాప్‌లో వుండే కథ అనీ, అందులో నటించాలనీ ఆ నిర్మాత అనుష్క శర్మ ముందు ఓ ప్రతిపాదన వుంచినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అనుష్క సదరు నిర్మాతకు ఇంకా ఓకే చెప్పకపోయినా, ‘నో’ అయితే చెప్పలేదని అంటున్నారు. తనకు కొంత సమయం కావాలని అడిగిన అనుష్క, కొద్ది రోజుల్లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం వుందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నటి సమీరారెడ్డి ప్రెగ్నెంట్‌గా నెలలు నిండిన టైవ్‌ులో అండర్ వాటర్ ఫొటోగ్రఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టూ పీస్ బికినీలో అప్పట్లో సమీరారెడ్డి ఫొటో షూట్ చేయించుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. చాలామంది అందాల భామలు తమ ప్రెగ్నెన్సీని ఓ సెలబ్రేషన్‌లా మీడియా ముందు వుంచేందుకు రకరకాల ఫొటో సెషన్లు చేయించుకున్నారు. అనుష్క గనుక వెబ్ సిరీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఇది చాలా చాలా ప్రత్యేక సందర్భమే అవుతుంది.