iDreamPost
android-app
ios-app

అంటే సుందరానికి టెన్షన్ మొదలయ్యింది

  • Published Jun 15, 2022 | 2:17 PM Updated Updated Jun 15, 2022 | 2:17 PM
అంటే సుందరానికి టెన్షన్ మొదలయ్యింది

పబ్లిక్ టాక్ బాగానే వచ్చింది. రివ్యూస్ డీసెంట్ గా రాశారు. అయినా కూడా అంటే సుందరానికి ఎదురీత తప్పడం లేదు. సోమవారం నుంచి కలెక్షన్లలో కనిపిస్తున్న డ్రాప్ కనీసం బ్రేక్ ఈవెన్ అయినా చేరుకుంటుందానే ;అనుమానాలు రేపుతోంది. ఇప్పటిదాకా వచ్చిన షేర్ 15 కోట్ల దాకా ఉండొచ్చని ట్రేడ్ రిపోర్ట్. నష్టం రాకుండా ఉండాలంటే ఇంకో 13 కోట్లకు పైగానే షేర్ రావాలి. గ్రాస్ లెక్కలో అయితే పాతిక పై మాటే. కాని ఆ సూచనలు కనిపించడం లేదు. టీమ్ ఎంతగా ప్రమోషన్ చేస్తున్నా నాని మంచి సినిమా అని పదే పదే చెబుతున్నా పబ్లిక్ లో కదలిక రావడం లేదు. ఇమేజ్ ఉన్న హీరో ఎంటర్ టైన్మెంట్ మూవీకి ఇలా జరగడం అరుదుగా చూస్తుంటాం.

లెన్త్ విషయంలో ఎన్ని కంప్లయింట్స్ వచ్చినా దర్శకుడు వివేక్ ఆత్రేయ తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం ఒకరకంగా మైనస్సే. మనం తీసుకున్న సినిమా కాబట్టి అందులో ప్రతి ఫ్రేమ్ ఇష్టంగానే కనిపించవచ్చు. కానీ జనరల్ ఆడియన్స్ ఎలా ఫీలయ్యారన్నది ముఖ్యం. అదేమీ పట్టించుకోకుండా పదే పదే మేము క్లాసిక్ తీశామని చెప్పుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇప్పుడిక డ్యామేజ్ రిపేర్ చేయడానికి కూడా ఏమి లేదు. ఈ వారం విరాట పర్వం, గాడ్సే రాబోతున్నాయి. ఒకవేళ వీటికి రెస్పాన్స్ అటుఇటుగా ఉంటే అంటే సుందరానికి మరొక ఛాన్స్ దక్కొచ్చు. కాకపోతే విక్రమ్ దూకుడు దాన్ని టేకోవర్ చేసే ప్రమాదం లేకపోలేదు.

నాని పరిస్థితి ఒకరకంగా అయోమయమనే చెప్పాలి. వి లాంటి క్రైమ్ థ్రిల్లర్ చేస్తే రిజెక్ట్ చేశారు. ఫ్యామిలీ సెంటిమెంట్ ను నమ్ముకుని టక్ జగదీశ్ అంటే తిరస్కరించారు. దేవదాసిల బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ గా ట్రై చేసిన శ్యామ్ సింగ రాయ్ హిట్ దాకా తీసుకెళ్లారు. ఇప్పుడు వినోదం ప్రధానంగా లవ్ స్టోరీ ఇస్తే దీన్ని నెత్తినబెట్టుకోవడం లేదు. వీటి సంగతెలా ఉన్నా నాని ప్రాక్టికల్ గా ఆలోచించడం చాలా అవసరం. ఒకప్పుడు భలే భలే మగాడివోయ్, ఎంసిఏ లాంటివి ఈజీగా 40కోట్లను వసూలు చేసే స్టేజి నుంచి ఇప్పుడు బాగానే ఉందని పేరొచ్చిన అంటే సుందరానికి పెరిగిన రేట్లతోనూ ముప్పై కోట్లు గ్యారెంటీగా రాలేని స్థితికి వెళ్ళింది. సో నాని ఇకపై ఇంకా జాగ్రత్తగా ఉండాలి.