iDreamPost
android-app
ios-app

కలవరపెడుతోన్న వరుస అత్యాచారాలు.. పాతబస్తీలో మరో దారుణం

  • Published Jun 06, 2022 | 12:10 PM Updated Updated Jun 06, 2022 | 12:10 PM
  • Published Jun 06, 2022 | 12:10 PMUpdated Jun 06, 2022 | 12:10 PM
కలవరపెడుతోన్న వరుస అత్యాచారాలు.. పాతబస్తీలో మరో దారుణం

భాగ్యనగరానికి ఏమైంది ? రోజురోజుకూ.. రేప్ కేసులు ఎందుకు పెరిగిపోతున్నాయి ? ఈ దారుణాలకు ఎవరి నిర్లక్ష్యం కారణం ? అన్న ప్రశ్నలకు సమాధానం అంతుచిక్కడం లేదు. నగరంలోని జూబ్లిహిల్స్ లో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్, మొఘల్ పుర మైనర్ బాలిక ఘటన మరువకుండానే.. వరుసగా మరిన్ని దారుణాలు వెలుగులోకొస్తున్నాయి. తాజాగా పాతబస్తీ ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన రేప్ ఘటన వెలుగుచూసింది.

కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. 9వ తరగతి విద్యార్థినిని ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రెండ్రోజుల పాటు బాలికపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత వదిలిపెట్టాడు. బాధిత బాలిక కాలాపత్తర్ పోలీసులకు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş