Idream media
Idream media
2020… ప్రపంచ మానవాళికి శాశ్వతంగా గుర్తుండిపోతుంది. కరోనా మహమ్మారి సృష్టించిన విలయానికి ప్రభావితం కాని వారు, ఆర్థికంగా ఇబ్బందులు పడిన వారు అంటూ ఎవరూ లేరు. ప్రపంచంలోను, అందులోనూ భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే.. ఏపీ ప్రజలు కరోనా మహమ్మారి వల్ల తెలెత్తిన ఇబ్బందులను ప్రభుత్వ అండతో సులువుగా అదిగిమించారని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యల నుంచి ఏపీ ప్రజలను జగన్‌సర్కార్ గట్టెక్కించింది. కరోనా సమయంలో దేశ ప్రభుత్వాలు, ఆర్థికంగా బలమైన దేశాలు కూడా విలవిలలాడగా… ఏపీ ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాల అమలుతో అబ్బురపరిచింది. అందరి దృష్టిని జగన్ సర్కార్ ఆకర్షించింది. 2020లో జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు ఒక సారి గుర్తుచేసుకుంటే.. ఇలాంటి విపత్కర సమయంలో జగన్ ఇన్ని చేశారా..? అనే ఆశ్చర్యం కలగకమానదు.
నగదు బదిలీ సంక్షేమ పథకాలు..
– అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లి ఖాతాలో 15 వేల రూపాయలు జమ చేశారు. ప్రతి ఏడాది ఈ పథకం అమలవుతుంది.
– వైఎస్సార్ కాపు నేస్తం పథకం పేరుతో 45–60 ఏళ్ల మధ్య ఉన్న కాపు మహిళలకు 15 వేల రూపాయలు అందించారు. ప్రతి ఏడాది ఈ పథకం అమలవుతుంది.
– అర్హత ఉన్న వారికి ఫించన్లు మంజూరు చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చే సమయానికి 53.19 లక్షలుగా ఉన్న ఫించన్ల సంఖ్య ప్రస్తుతం 63 లక్షలకు చేరుకుంది.
– ఐఐటీ, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ చదివే విద్యార్థులకు జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఏడాదికి 15 – 20 వేల రూపాయలు హస్టల్, భోజనం ఖర్చుల కింద అందించారు. ప్రతి ఏడాది ఈ పథకం కూడా అమలు అవుతుంది.
– కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వారికి (రేషన్‌కార్డుదారులు) వెయి రూపాయల చొప్పన సాయం చేశారు.
– డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తూ.. డ్వాక్రా మహిళల ఖాతాల్లో వడ్డీ సొమ్ము 1400 కోట్ల రూపాయలు జమ చేశారు.
– మత్య్సకారులకు వేట నిషేధం సమయంలో ఇచ్చే పరిహారాన్ని 4 వేల నుంచి 10 వేల రూపాయలకు పెంచి ఇచ్చారు.
– వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద ఆటోలు, ట్యాక్సిలు నడుపుకునే వారికి రెండో విడత పది వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు.
– రజకులు, దర్జీలు, సెలూన్ దుకాణాలు నిర్వహించుకునే వారికి జగనన్న చేదోడు పథకం ద్వారా పది వేల రూపాయల చొప్పన వారి ఖాతాలకు నగదు బదిలీ చేశారు. ప్రతి ఏడాది ఈ పథకం అమలు చేస్తున్నారు.
– కరోనా సమయంలో ఆరు నెలలు ముందుగానే వైఎస్సార్ కాపు నేస్తం పథకం రెండో విడత అమలు చేశారు.
– వైఎస్సార్ నేతన్న హస్తం పథకం ద్వారా మగ్గం నేసే ప్రతి చేనేత కుటుంబానికి 24 వేల రూపాయల చొప్పన ఆర్థిక సాయం చేశారు. ఈ పథకం ప్రతి ఏడాది అమలు చేస్తున్నారు.
– వైఎస్సార్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలోని 45–60 ఏళ్ల లోపు మహిళలకు 18,750 రూపాయల చొప్పన ఆర్థిక సాయం చేశారు. మరో మూడేళ్లు ఈ పథకం అమలుకానుంది.
– 50.47 లక్షల మంది రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద 13,500 రూపాయల చొప్పన మూడు దశల్లో ఆర్థిక సాయం చేశారు.
– రైతులకు సున్నా వడ్దీ పథకం అమలు. దీని ద్వారా 57 లక్షల మంది రైతులకు 1,150 కోట్ల రూపాయల పంపిణీ.
– చిరు వ్యాపారులకు వడ్డీ లేకుండా పది వేల రూపాయలు రుణం మంజూరు చేసేలా జగనన్న తోడు పథకం అమలు చేశారు.
– పాడి రైతులు మేలు జరిగేలా అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టుకు శ్రీకారం. పాలు పోసే రైతులు లీటర్‌కు 4–7 రూపాయలు ప్రోత్సాహకం అందిస్తున్నారు.
– నివర్ తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ 647 కోట్ల రూపాయలు అందించారు.
నగదు బదిలీయేతర సంక్షేమ పథకాలు..
– వైద్యం ఖర్చు వేయి దాటితే ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేశారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కిందకు అన్ని ఆనారోగ్య సమస్యలను తెచ్చారు. రేషన్‌కార్డుతోపాటు ఏడాదికి ఐదు లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా 1.42 కోట్ల కుటుంబాలకు కార్డులు ఇచ్చారు.
– కరోనాకు ఉచితంగా చికిత్సను, పౌష్టికాహారాన్ని అందించారు.
– ప్రతి మండలానికి ఒక 108, ఒక 104 చొప్పున 1088 వాహనాలను సమకూర్చారు.
– ఉచితంగా బోర్లు, మోటార్లు ఏర్పాటు చేసేందుకు వైఎస్సార్ జళకళ పథకం ప్రారంభించారు.
– జగనన్న విద్యా కానుక పేరిట ప్రభుత్వ స్కూళ్లలో విద్యనభ్యసించే 43 లక్షల మంది విద్యార్థులకు యూనిఫాం, బ్యాగ్, టెక్ట్స్, నోట్స్ పుస్తకాలు, బెల్ట్, టై, బూట్లు, సాక్కులు అందించారు.
– 1.53 లక్షల గిరిజనులకు 3.12 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారు.
– 1.41 లక్షల కుటుంబాలకు బీమా కల్పించేందుకు వైఎస్సార్ ఉచిత బీమా పథకం ప్రారంభించారు.
– సమగ్ర భూ సర్వే ద్వారా భూ సమస్యలు పరిష్కరించేందుకు వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం ప్రారంభించారు.
పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు..
– మూడు ప్రాంతాల సమానాభివృద్ధికి మూడు రాజధానులను ప్రతిపాదించారు. అసెంబ్లీలో ఆమోద ముద్ర వేశారు.
– గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రారంభమైంది. 536 రకాల సేవలను ప్రజలకు స్థానికంగానే అందిస్తున్నారు.
– మద్యం, ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు స్పెషల్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ)ని ఏర్పాటు చేశారు.
– వ్యసాయం, పాడి రంగాల రైతులకు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, పశువైద్యం, దాణా అందించేందుకు ప్రతి గ్రామ సచివాలయం వద్ద 10,641 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేశారు.
ఉద్యోగాలు – ఉద్యోగుల సంక్షేమం
– ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఉద్యోగుల భవితకు భరోసా కల్పించారు.
– ఏపీ అవుట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు. దీని ద్వారా 50, 449 మందికి ఉద్యోగాలు కల్పన. జీతాలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేలా విధానపరమైన నిర్ణయం.
– ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏను విడుదల చేశారు.
Read Also : అటు సీఎస్.. ఇటు సీజే.. ఏపీలో ఒకే రెండు కీలక పరిణామాలు..