iDreamPost
iDreamPost
పేద కుంటుంబాల్లో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. వైఎస్సార్ బీమా పేరుతో ఆరంభించిన ఈ పథకం నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ పథకం కింద అయ్యే ఖర్చును అంటే ప్రీమియం మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తోంది. వైఎస్సార్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఉచిత బీమా పథకం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి
అమలు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తప్పుకున్నా..
2020 సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పథకం నుంచి తప్పుకుంది. ఇన్సూరెన్స్ కన్వ ర్జెన్స్ స్కీం స్థానంలో అర్హుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల ద్వారా బీమా చేయించాలని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా గత సంవత్సరం రాష్ట్రంలో అర్హులైన 1.21 కోట్ల కుటుంబాల తరపున రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం మొత్తాన్ని చెల్లించింది. అయితే బ్యాంకులు వ్యక్తిగత ఖాతాలు తెరిచి, వాటి ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బు కట్టే ఎన్ రోల్ చేయించే బాధ్యతను తీసుకోలేదు. ఈ కారణంగా కేవలం 62.5 లక్షల మంది లబ్ధిదారులను మాత్రమే బ్యాంకులు ఎన్ రోల్ చేయగలిగాయి. మిగిలిన 58.5 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చెల్లించినప్పటికీ బ్యాంకులు ఎన్ రోల్ చేయలేకపోయాయి.
Also Read : ఏపీలో ఆ పధకం తెచ్చిన మార్పులు ఏమిటి..?
మానవతా దృక్పథంతో..
ఒకవైపు ఎన్ రోల్ మెంట్ సమస్య, మరోవైపు బ్యాంకులు ప్రతి వ్యక్తిగత క్లైయిమ్ ను బీమా కంపెనీలతో ఫాలో అప్ చేయించి ఇన్సూరెన్స్ మొత్తం ఇప్పించలేకపోతున్నాయి. దీంతో క్లైయిమ్ ల పరిష్కారం లో విపరీతమైన జాప్యం జరుగుతోంది. అర్హులైనప్పటికీ బ్యాంకుల్లో ఎన్ రోల్ కాకుండా ఉండిపోయినవారు, ఎన్ రోల్ అయినా 45 రోజుల లీవ్ పీరియడ్ పూర్తి కాకముందే మరణించినవారు 12,039 మంది గత సంవత్సరం లెక్కల్లో తేలారు. వారి కుటుంబాలకు బీమా క్లైమ్ కు సమానమైన రూ. 254.72 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వమే మానవతా దృక్పథంతో చెల్లించింది.
పథకం నిర్వహణ కూడా..
బ్యాంకులలో ఎన్ రోల్ మెంట్ విషయంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి, క్లైమ్ ల పరిష్కారంలో అవరోధాలను అధిగమించడానికి ప్రభుత్వమే పథకం నిర్వహణ బాధ్యత తీసుకుంది. 2021 జులై ఒకటో తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది.
Also Read : జగన్ ఏం చెప్పారో.. అదే చేస్తున్నారు..
రూ.750 కోట్లతో బీమా రక్షణ..
ఈ పథకం కింద 2021- 22 సంవత్సరానికి 1.32 కోట్ల పేద కుటుంబాలకు రూ.750 కోట్ల వ్యయంతో ఉచిత బీమా రక్షణ లభిస్తోంది. వైఎస్సార్ బీమా కింద ఇప్పటి వరకూ ప్రభుత్వం రూ.1,307 కోట్లు ఖర్చు చేసింది.
లభ్ది చేకూరేది ఇలా..
18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల వ్యక్తికి సహజ మరణం సంభవిస్తే ఆ కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తారు. 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు గల వ్యక్తి ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగ వైకల్యం పొందినా ఆ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా పరిహారం చెల్లిస్తారు. బీమా నమోదు విషయంలో గాని, క్లైమ్ ల చెల్లింపుల అంశంలో గాని ఏమైనా ఫిర్యాదులు ఉంటే 155214 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా బీమా సౌకర్యం కల్పించడం పేదల్లో భరోసా నింపుతోంది. తమ కుటుంబాలకు దీమా కల్పించేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలుపు తున్నారు.-
Also Read : తరతరాల సమస్య.. శాశ్వత పరిష్కారం.. జగన్ చారిత్రాత్మక అడుగు