ఏపీ బడ్జెట్‌.. ఏ రంగానికి ఎంత..?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. విద్య, వైద్యం, వివిధ వర్గాల ప్రజల సంక్షేమానికి అత్యధిక కేటాయింపులు చేశారు. వ్యవసాయానికి పెద్దపీట వేశారు. ఎన్నికల మెనిఫెస్టోలోని హామీల అమలుకు బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించారు. ఈ ఏడాది 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ ఇళ్లు కేటాయించేందుకు అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించింది. అన్ని రంగాల్లో పేదలకు వాటాను కల్పించిన వాడే నిజమైన నాయకుడు అని పేర్కొంటూ మంత్రి బుగ్గన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం అంచనా బడ్జెట్‌ 2,24,789.18 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో రెవెన్యూ వ్యయం 1,80,392.65 కోట్లుగా చూపించారు. మిగతా మొత్తం మూలధన వ్యయంగా పరగణించారు.

రంగాల వారీగా కేటాయింపులు ఇలా…

– ఎస్టీల సంక్షేమానికి 5,177.53 కోట్లు

– బీసీలకు 25,331.30 కోట్లు

– మైనారిటీలకు 2052

– ఎస్సీల సంక్షేమానికి 15,735.65 కోట్లు

– కాపు సంక్షేమానికి 2,847 కోట్లు

– వివిధ అభివృద్ధి పథకాలకు 84,140.97 కోట్లు

– వైద్య రంగానికి 11,

– వైఎస్సార్‌ గృహ వసతికి 3 వేల కోట్టు

– పీఎం ఆవాస్‌ యోజన – అర్బన్‌కు 2,540 కోట్లు

– పీఎం ఆవాస్‌ యోజన – గ్రామీణంకు 500 కోట్లు

– బలహీన వర్గాల గృహ నిర్మాణానికి 150 కోట్లు

– రేషన్‌ బియ్యానికి 3 వేల కోట్లు

– డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం 975 కోట్లు

– జగనన్న తోడు పథకానికి 100 కోట్లు

– వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకకు 16వేల కోట్టు

– వైఎస్సార్‌ చేయూతకు 3 వేల కోట్లు

– జగనన్న వసతి దీవెనకు 2 వేల కోట్లు

– జగనన్న చేదోడుకు 274 కోట్లు

– వ్యవసాయానికి 11,891 కోట్లు

– వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు 100 కోట్లు

– వడ్డీలేని రుణాల కోసం 500 కోట్లు

– వైఎస్సార్‌ నేతన్న హస్తం కోసం 200 కోట్లు

– వైఎస్సార్‌ మత్య్సకార భరోసా పథకానికి 109.75 కోట్లు

– లా నేస్తం కోసం

– అమ్మ ఒడికి 6 వేల కోట్లు

– జగనన్న విద్యా దీవెన 3009 కోట్లు

– వైఎస్సార్‌ ఆసరాకు 6300 కోట్లు

– వైఎస్సార్‌ కాపు నేస్తం కోసం 350 కోట్లు

– వైఎస్సార్‌ వాహన మిత్రకు 275.51 కోట్లు

– వైఎస్సార్‌ రైతు భరోసా పథకానికి 3,615.60 కోట్లు

– రైతులకు వడ్డీలేని రుణాల కోసం 1100 కోట్లు

– ధరల స్తిరీకరణ నిధికి 3 వేల కోట్లు

– విపత్తు సహానిధి 2 వేల కోట్లు

– రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కోసం 54 కోట్లు

– పశువుల బీమాకు 50 కోట్లు

– ఇమామ్, మౌజమ్‌లకు 50 కోట్లు

– లా నేస్తం కోసం 12.75 కోట్లు

– ఆరోగ్యశ్రీకి 2100 కోట్లు
– నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కోసం 1800 కోట్లు

– జెరుసలేం పవిత్ర యాత్రకు 5 కోట్లు

– అగ్రి గోల్డ్‌ బాధితుల పరిహారం కోసం 200 కోట్లు

– విద్యాశాఖలో నాడు నేడు కార్యక్రమానికి 3 వేల కోట్లు

Show comments