iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాల్లో అప్పటినుంచి భారీ వర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లో అప్పటినుంచి భారీ వర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బాగా తగ్గిపోయాయి. వర్షాల స్థానంలో ఎండలు పెరిగిపోయాయి. ప్రస్తుత వాతావరణం ఎండాకాలాన్ని తలపిస్తోంది. ఇక, అక్కడక్కడా చిరు జల్లులనుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అది కూడా రెండు, మూడు రోజుల కొకసారి వర్షాలు పడుతున్నాయి. జులై నెలలో దంచి కొట్టిన వానలు ఆగస్టులో బాగా తగ్గిపోయాయి. నెల మొత్తం మీద రెండు మూడు సార్లు మాత్రమే వర్షాలు కురిశాయి. ఆగస్టు నెలలో వర్షాలు లేకపోయినా.. సెప్టెంబర్‌ నెలలో మాత్రం వర్షాలు మళ్లీ మొదలవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

వచ్చే సెప్టెంబర్‌ నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సాధారణం లేదా అంతకు మించిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తోంది. సెప్టెంబర్‌ 2 లేదా 3వ తేదీనుంచి వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

ఈ వర్షాలు సెప్టెంబర్‌ నెల మొత్తం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఎండలు ఎండాకాలాన్ని తలపిస్తున్నాయి. 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రిళ్లు ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సాధారణం కంటే ఎక్కువ ఉష్టోగ్రతలు నమోదవుతుండటంతో.. అది భారీ వర్షాలకు దారి తీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. ఈ ఉష్టోగ్రతల కారణంగా సెప్టెంబర్‌లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటోంది.