iDreamPost
android-app
ios-app

కొత్తవి కాదట.. అన్నీ పాతవేనట..

కొత్తవి కాదట.. అన్నీ పాతవేనట..

ప్రజల జీవన ప్రమాణాలను మార్చేలా వినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సర్కార్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. ఏపీ పథకాలను తమ రాష్ట్రాలలో అమలు చేసేందుకు పలు ప్రభుత్వాలు అధికార బృందాలను పంపి అధ్యయనం చేస్తున్నాయి. ప్రధాని మోదీ కూడా జగన్‌ సర్కార్‌ పరిపాలన తీరును కొనియాడారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీని అనుసరించాలని సూచించారు.

ఓ వైపు పరిపాలన సంస్కరణలు, మరో వైపు అర్హత ఆధారంగా నేరుగా లబ్ధిదారులకే సంక్షేమ పథకాలను అందిస్తున్న జగన్‌ సర్కార్‌.. విమర్శకుల మన్ననలను సైతం పొందుతోంది. అయితే జగన్‌ సర్కార్‌కు ప్రజల్లో వస్తున్న ఆదారణను తగ్గించేందుకు టీడీపీ అనుకూల మీడియా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తిమ్మిని బమ్మిని చేసేందుకు కలాన్ని ఉపయోస్తోంది. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రిక ఈ విషయంలో ముందు వరసలో ఉంది. జగన్‌ ప్రభుత్వం కొత్త పథకం ప్రారంభించిన ప్రతి సారి.. ఆ పథకాన్ని తక్కువ చేసి చూపించేందుకు కథనాలు వండి వారుస్తోంది. ఏ పథకమైనా సరే అది చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నదేనని, పాత పథకానికే పేర్లు మార్చి అమలు చేస్తున్నారని ప్రచారం చేస్తోంది.

జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్‌ వాహన మిత్ర, వైఎసాసర్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా.. తాజాగా ఈ రోజు ప్రారంభమైన జగనన్న విద్యా కానుక పథకం.. అన్నీ పాతవేనంటూ ఆంధ్రజ్యోతి ఆయా పథకాలు ప్రారంభించే రోజున బ్యానర్‌ కథనాలుగా ప్రచురించింది.

కానుక కిటుకు.. పాత పథకానికే కొత్త సోకు.. అంటూ జగనన్న విద్యా కానుక పథకంపై ఈ రోజు ఆంధ్రజ్యోతి ప్రముఖంగా కథనాన్ని ప్రచురించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఈ పథకం అమలుచేసినట్లుగా చెబుతోంది. అప్పుడు కూడా పిల్లలు రెండు జతల యూనిఫాంలు, అందుకు 40 రూపాయల చొప్పన కుట్టు కూలీ, ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారని, వీటితోపాటు ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్‌లు, నోట్‌ పుస్తకాలు కూడా ఇచ్చారని చెప్పుకొచ్చింది. దీనికి అదనంగా ఇప్పుడు ఒక జత యూనిఫాం, బెల్ట్, టైం, వర్క్‌బుక్‌లు ఇస్తున్నారని ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది.

జగన్‌ ప్రభుత్వం ప్రారంభించే పథకాన్ని తగ్గించి చూపేందుకు ఆంధ్రజ్యోతి కథనం రాసినా.. అందులో పొందుపరుస్తున్న వివరాలను ప్రజలు గతంతో పోల్చుకుని బేరీజు వేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలోనూ పిల్లలు పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫాంలు ఇచ్చారు. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్న పథకమే. ఇక కుట్టుకూలి కింద ఇచ్చే 40 రూపాయలు కొన్ని సంస్థలకు ఇచ్చి కుట్టిన యూనీఫాంలనే పిల్లలకు అందించారు. సరైన సైజుల్లో ఉండకపోవడంతో పిల్లలకు సౌకర్యవంతగా ఉండేవి కావు.

ఇక ఒక జత బూట్లు, రెండు సాక్కులు, నోట్‌ పుస్తకాలు కూడా చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఇచ్చారని ఆంధ్రజ్యోతి రాయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాబు ఐదేళ్లలో జత బూట్లు, సాక్సులు, నోట్‌ పుస్తకాలు ఒక్క ఏడాది కూడా ఇవ్వలేదు. కానీ ఇచ్చారని ఆంధ్రజ్యోతి చెప్పడమే విడ్డూరంగా ఉంది. అంటే.. ఈ మూడు వస్తువులు ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లుగా చూపి గత ప్రభుత్వంలో నిధులు పక్కదారి పట్టినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఇక కేరళ, ఢిల్లీలో ఏపీలో కన్నా ఈ పథకం గొప్పగా అమలు చేస్తున్నారని చెబుతూ.. విద్యా కానుకపై తన కడుపుమంటను ఆంధ్రజ్యోతి బయటపెట్టుకుంది.

Read Also: నాలుగో‘సారి’..