iDreamPost
android-app
ios-app

మూడ్ బాగుందా అంటూ యాంకర్ ప్రశ్న.. హర్టైన హెబ్బా పటేల్

మూడ్ బాగుందా అంటూ యాంకర్ ప్రశ్న.. హర్టైన హెబ్బా పటేల్

‘మేఘాలు లేకున్నా, నాపైన ఈ వాన, రాగాలూ తీసే నీవల్లేనా’ అంటూ మన హీరో రాజ్ తరుణ్ ఓ అమ్మాయి గురించి పాడతాడు. ఆమె మరెవ్వరూ కాదు హెబ్బా పటేల్. తన చబ్బీ నటనతో కుమారి 21 ఎఫ్‌తో కుర్రకారుకు మెంటల్ ఎక్కించింది. అలా ఇలా అంటూ తెలుగు సినిమాల్లో అడుగుపెట్టిన ఈ ముంబయి బ్యూటీ ..చాలా సినిమాలు చేసినప్పటికీ.. సరైన సక్సెస్‌ను పొందలేకపోయింది. ఈడోరకం, ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా వంటి సినిమాలు చేసింది. అలాగే ఓదెల రైల్వే స్టేషన్ వంటి ఓటీటీ ఫిల్మ్ చేసి.. తన నటనతో మెప్పించింది. ఇప్పుడు ఓటీటీలకు మంచి క్రేజ్ ఏర్పడటంతో వెబ్ సిరీస్ చేస్తోంది. ఇప్పుడు మరో ఓటీటీ ఫిల్మ్ రాబోతుంది హెబ్బా పటేల్.

ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ వెబ్ సిరీస్ ఈ నెల అక్టోబర్ 6 నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మదనపల్లెలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. హెబ్బాపటేల్ కీలక పాత్ర పోషించగా.. రామ్ కార్తీక్, నరేష్, పవిత్రా లోకేశ్, జయ ప్రకాశ్ తదితరులు మిగిలిన పాత్రధారులు. ఈ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొంటోంది హెబ్బా పటేల్. ఓ యూట్యూబర్‌కు ఇచ్చే క్రమంలో సదరు యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ఫస్ట్ ఓకే చెప్పిన ఆమె.. ఆ తర్వాత అర్థం కాక అయోమయం ఫేస్ పెట్టి.. చివరకు హర్ట్ అయ్యి ఇంటర్వ్యూ ఇవ్వనంటూ వెళ్లిపోయింది. అయితే ఇది ఫ్రాంక్ వీడియో అనుకుంటే పొరపాటు.. ఆమె నిజంగానే వెళ్లిపోయినట్లు యాంకర్ కార్తీక్ అనే యూజర్ పేర్కొనడంతో హెబ్బా హర్ట్ అయ్యిందనేది తెలుస్తోంది.

ఇంతకు ఏ ప్రశ్నకు ఆమె హర్ట్ అయ్యిందంటే..? యాంకర్ ఎలా ఉన్నారు అని అడిగి.. ‘మీ మూడు బాగుందా’ అంటూ ప్రశ్నించాడు. హా ఓకే అన్నాక.. యాంకర్ మరింత ప్రొలాంగ్ చేశాడు. ‘మీ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అందుకే ముందే అడుగుతున్నా. మీతో మాట్లాడొచ్చా అన్న మీనింగ్‌తో మాట్లాడుతున్నా’ అని అడిగాడు. హెబ్బాకు అర్థం కావడంతో..మీరు ఫ్రీగానే ఉన్నారా.. మీ మూడు బాగుందా అని మాత్రమే అడిగానని,అనే సరికి.. మూడ్‌తో కనెక్షన్ ఏముందీ.. ప్రమోషన్ కదా అని ప్రశ్నిస్తూ.. తాను ఇంటర్వ్యూ ఇవ్వాలని అనుకోవడం లేదని సీరియస్‌గా లేచి వెళ్లిపోయింది. అయితే ఈ ఇంటర్వ్యూ పూర్తి అయ్యిందా లేదా అనే క్లారిటీ లేదు. కొంత మంది అయ్యిందని చెబుతుంటే.. కొంత మంది కాలేదని చెబుతున్నారు.