Krishna Kowshik
Sowmya Rao: నవ్వులు పువ్వులు పూయిస్తున్న బుల్లితెర కామెడీ షో జబర్దస్త్. ఎన్నో సంవత్సరాలుగా టీవీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇందులో కంటెస్టెంట్స్, జడ్జెస్ మాత్రమే కాకుండా యాంకర్స్ సైతం ఆకట్టుకున్నారు. వారిలో ఒకరు యాంకర్ సౌమ్య రావ్. అయితే సడన్ గా ఆమె వెళ్లిపోవడంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది.
Sowmya Rao: నవ్వులు పువ్వులు పూయిస్తున్న బుల్లితెర కామెడీ షో జబర్దస్త్. ఎన్నో సంవత్సరాలుగా టీవీ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇందులో కంటెస్టెంట్స్, జడ్జెస్ మాత్రమే కాకుండా యాంకర్స్ సైతం ఆకట్టుకున్నారు. వారిలో ఒకరు యాంకర్ సౌమ్య రావ్. అయితే సడన్ గా ఆమె వెళ్లిపోవడంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది.
Krishna Kowshik
బుల్లితెరపై కామెడీతో కితకితలు పెట్టిస్తోన్న షో జబర్దస్త్. ఎన్నో సంవత్సరాలుగా ఈ ధారావాహిక నిర్విరామంగా కొనసాగుతుంది. ఈ షోతో ఎంతో మంది కెరీర్ స్టార్ట్ చేసి ఈనాడు వెండితెరపై తమ సత్తాను చాటుతున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శీనుతో సహా పలువురు కమెడియన్స్ బిగ్ స్క్రీన్ పై రాణిస్తున్నారు. అలాగే ఇందులో ఫస్ట్ యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ భరద్వాజ సైతం.. వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. దీంతో ఈ షో నుండి క్విట్ అయిన సంగతి విదితమే. ఈమె ప్లేసులోకి రీప్లేస్ అయ్యింది కన్నడ సీరియల్ నటి, బుల్లితెర యాక్టర్ సౌమ్యరావ్. అనసూయ అంత కాకపోయినా.. వచ్చి రానీ తెలుగుతో ఆకట్టుకుంది. అప్పుడప్పుడే ఫేమ్ తెచ్చుకుంటుంది. అంతలో ఆమె కూడా కనిపించకుండా పోయింది. ఆమె స్థానంలోకి వచ్చింది బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంతు.
ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కొత్తగా రీ డిజైన్ చేసి.. టైమింగ్స్ మార్చారు. గతంలో గురు, శుక్రవారాల్లో వస్తుండగా.. ఇప్పుడు శుక్ర, శనివారాల్లో టీవీ ప్రేక్షకులను పలకరిస్తోంది నవ్వుల ధారావాహిక. దీనికి రష్మీ గౌతమ్ యాంకర్. అయితే చాలా మందికి సౌమ్య రావ్ ఎందుకు వెళ్లిపోయిందో తెలియలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూతో పాల్గొని పలు విషయాలు పంచుకుంది ఆమె. జబర్దస్త్ నుండి సడెన్‌గా కనుమరుగవ్వడంతో వాళ్లు తీసేశారా, మీరు వెళ్లిపోయారా అన్న ప్రశ్న ఎదురు కాగా, అగ్రిమెంట్ అయిపోయింది అందుకే ఈ షో నుండి క్విట్ అయ్యానని చెప్పింది. ‘వన్ ఇయర్ అగ్రిమెంట్ అని చెప్పారు. అయిపోయింది. నెక్ట్స్ ఇయర్ కొత్త ఫేస్ ట్రైం చేస్తాం అన్నారు. ఇట్స్ ఓకే అని చెప్పా. అక్కడ ఉన్నప్పుడు మంచిగానే చూసుకున్నారు. బెంగళూరు నుండి ఇక్కడకు తీసుకు వచ్చి, క్యాబ్ వంటి సౌకర్యాలిచ్చారు. పేమెంట్స్ ఇష్యూస్ కానీ, కంటెస్టెంట్ల నుండి కానీ ఎటువంటి ఇష్యూస్ లేవు. టీమ్ లీడర్స్, జడ్జస్, ప్రొడక్షన్ టీం, మేనేజ్ మెంట్ బాగా చూసుకున్నారు’ అని పేర్కొంది.
ఆడియన్స్‌లో తన కన్నా తన పేరు వెళ్లకపోవడంపై సౌమ్య రావ్ స్పందించింది. ‘అప్పుడే వచ్చాను అప్పుడే సమయం అయిపోయింది. సీరియల్స్ అవకాశాలు కూడా వచ్చాయి. కానీ యాంకరింగ్ చేస్తున్నప్పుడు సీరియల్స్ చేయడం వదులుకున్నాను. మళ్లీ మంచి ఆఫర్స్ వస్తే వెళతాను. నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే..? ఒక కంపెనీపై, ఒకరిపై ఆధారపడకూడదు. ఒక ఆర్టిస్టుగా మన మార్గాలను మనమే వెతుక్కోవాలి. ఎక్కడ అవకాశాలు దొరుకుతాయో ఆ దారుల్లో వెళ్లిపోవాలి. ఈ దారి బాగుంది.. ఇందులోనే వెళ్లాలని ఓ ఆర్టిస్టు అనుకోకూడదు. ఆ దారిని ఎప్పుడు, ఎవరు, ఎలా క్లోజ్ చేస్తారో మనకు తెలియదు’ అంటూ చెప్పుకొచ్చింది. హోస్టుగా రాణించాలంటే గ్లామర్ అవసరం లేదని, మంచిగా మాట్లాడాలి, టైమింగ్ బాగుండాలి, ఎక్ ట్రాక్ట్ చేయగలగాలి’ అని చెప్పింది సౌమ్య. ప్రస్తుతం ఆమె కిరాక్ బాయ్స్, కిలాడీ లేడీస్ షోలో కనిపిస్తుంది.