iDreamPost
android-app
ios-app

చెర్రీ సినిమాలో అన‌సూయ సంద‌డి ఎక్కువేన‌ట‌..!

  • Published Jan 24, 2018 | 5:22 AM Updated Updated Jan 24, 2018 | 5:22 AM
  • Published Jan 24, 2018 | 5:22 AMUpdated Jan 24, 2018 | 5:22 AM
చెర్రీ సినిమాలో అన‌సూయ సంద‌డి ఎక్కువేన‌ట‌..!

చెర్రీ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల‌కు రాబోతున్న‌ సినిమా ‘రంగస్థలం’ . పూర్తిగా ప‌ల్లెటూరు నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న‌ ఈ  చిత్రంలో న‌టి అన‌సూయ చెర్రీకి అత్త‌గా న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే…! .అంతేకాదు.. ఆ త‌ర‌హా పాత్ర‌ల‌ను పోషించేందుకే నేను త్వ‌ర‌గా పెళ్లి చేసేసుకున్నానేమో అని అన‌సూయ కూడా ఈ అంశంపై స‌ర‌దాగా వ్యాఖ్యానించింది కూడా..! అయితే తాజాగా   ఈ సినిమాలో త‌న‌ది అత్త పాత్ర కాదంటూ అనసూయనే స్వయంగా ప్రకటించడంతో.. అస‌లామె పాత్ర ఎలా ఉండ‌బోతుందా.. అన్న ఆస‌క్తి  ఇప్పుడు ప్రేక్ష‌కుల్లో మొద‌లైంది.

ఇదిలా ఉండ‌గా సోష‌ల్ మీడియాలో మాత్రం ‘రంగస్థలం’లో అనసూయ అత్త పాత్రలోనే క‌నిపించ‌బోతుందంటూ వార్త‌లు చ‌క్కెర్లు కొడుతున్నాయి.  విష‌య‌మేమిటంటే.. సినిమాలో చెర్రీకి మాత్రమే అత్త కాదట.. ఊరందరికీ అత్తగా ‘రంగమ్మత్త’ రూపంలో అన‌సూయ కనిపించనుందని తెలుస్తోంది. అంటే మ‌హాజ‌నానికి మ‌ర‌ద‌లు పిల్ల టైపులో అనుకోవ‌చ్చేమో..!. ప‌ల్లెటూరు నేప‌థ్యంలో సాగే క‌థ కాబ‌ట్టి అక్క‌డ జ‌నం సాధారణంగాఎలా పిలుస్తారో అలా ఉండేలా నాచురల్‌గా ‘రంగమ్మత్త’గా అనసూయ పాత్రను రూపొందించాడట దర్శకుడు సుకుమార్.  మొత్తంమీద ‘సోగ్గాడే చిన్నినాయ‌న’ చిత్రంలో నాగార్జున స‌ర‌స‌న న‌టించి మంచి పేరు సంపాదించిన అన‌సూయ ఈ సినిమాలో ఎలాంటి సంద‌డి చేయ‌నుందో చూడాలిమ‌రి..!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet