స్కూల్ లో అలా చెప్పారు.. కానీ నిజం ఇది అని నాకు తెలీదు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్..

సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్‌ మహీంద్రా. పలు ఆసక్తికర విషయాలని వెతికి పట్టుకొని మరీ ట్విట్టర్ లో షేర్ చేసి వాటికి తనదైన శైలిలో కామెంట్లు చేస్తాడు. అలాగే కష్టాల్లో ఉన్న వారికి కూడా సహాయం చేస్తూ ఉంటాడు ఆనంద్ మహీంద్రా. తాజాగా మరో వైరల్ వీడియోని షేర్ చేసి తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.

ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతానికి చెందిన ఓ వీడియోను మహీంద్రా ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం మాసిన్రాం అని అక్కడ వర్షాన్ని, వాటర్ ఫాల్స్ ని, మాసిన్రాం ప్రాంతంలో కుండపోతతో కురుస్తున్నవర్షాన్ని ఓ వ్యక్తి తన కారు లోపలి నుంచి వీడియో తీసి చూపించారు.

ఆ వీడియోని ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో షేర్ చేసి.. ”నేను పాఠశాల రోజుల్లో ఉన్నప్పుడు అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏదని అడిగితే చిరపుంజి అనే సమాధానం వచ్చేది. కానీ మాసిన్రాం టాప్‌ ప్లేస్‌లో ఉందని నాకు తెలియదు. ఈ దృశ్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి” అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో మరింత వైరల్ గా మారింది.

Show comments