iDreamPost
android-app
ios-app

‘మరో గ్రేట్ ఇండియన్ వెడ్డింగ్’ అంటూ ఫోటో షేర్ చేసిన మహీంద్రా! ఎవరిదంటే..!

  • Published Jul 17, 2024 | 5:26 PM Updated Updated Jul 17, 2024 | 5:26 PM

Anand Mahindra: ప్రస్తుతం జరుగుతున్న వివిధ అంశాలపై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ ఉంటారు. అలానే ప్రతిభవంతులైన వారిని గుర్తించి వెలుగులోకి తీసుకొస్తారు. తాజాగా ఓ ఫోటోను ఫోస్టు చేసి...అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చారు.

Anand Mahindra: ప్రస్తుతం జరుగుతున్న వివిధ అంశాలపై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ ఉంటారు. అలానే ప్రతిభవంతులైన వారిని గుర్తించి వెలుగులోకి తీసుకొస్తారు. తాజాగా ఓ ఫోటోను ఫోస్టు చేసి...అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చారు.

  • Published Jul 17, 2024 | 5:26 PMUpdated Jul 17, 2024 | 5:26 PM
‘మరో గ్రేట్ ఇండియన్ వెడ్డింగ్’ అంటూ ఫోటో షేర్ చేసిన మహీంద్రా! ఎవరిదంటే..!

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం జరుగుతున్న వివిధ అంశాలపై ఆయన స్పందిస్తూ ఉంటారు. అలానే ప్రతిభవంతులైన వారిని గుర్తించి వెలుగులోకి తీసుకొస్తారు.  అలానే ఆకట్టుకునే విషయాలను నెటినజ్లతో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. అలానే తాజాగా  ఆయన ఓ జంట ఫోటోలను ట్విట్టర్ లో పోస్టు చేశారు. అంతేకాక ‘గ్రేట్ ఇండియన్ వెడ్డింగ్’ అంటూ కొనియాడారు. ఆనంద్ మహీంద్ర ఆ దంపతుల ఫోటోలను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  ఆ జంట ఎవరా అని తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేస్తున్నారు. మరి.. ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఆ జంట ఎవరో ఇప్పుడూ చూద్దాం…

ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల సందడి మొదలైంది. రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీల తరుపున అభ్యర్థలు పోటా పోటీన ప్రచారం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మన తెలుగు మూలాలు ఉన్నవారు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అంతేకాక వారికి సంబంధించిన వాళ్లు కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే.. ఈ అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. అలానే తమ పార్టీ తరపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్‌ను ఆయన ప్రకటించారు. జేడీ వాన్స్ సతీమణి ఉష చిలుకూరి.

ఆమె ఎవరో కాదు… తెలుగింటి అమ్మాయినే. కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడ  స్థిరపడింది.  ఆమె తల్లిదండ్రులు ఏపీ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. యేల్ లా స్కూల్ లో ఉషా జెడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. 2014లో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. అగ్రరాజ్యంలో స్థిరపడినప్పటికీ..హిందూ సంప్రదాయంలోనే వీరు వివాహం చేసుకోవడం విశేషం.  తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో జేడీ వాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించడంతో ఇప్పటికే ఆయన  వరల్డ్ వైడ్ గా వార్తల్లో నిలిచారు. ఈ  క్రమంలోనే జేడీ వాన్స్, ఉష చిలుకూరికి సంబంధించిన పెళ్లినాటి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

అలానే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర కూడా ఉష చిలుకూరి దంపతుల పెళ్లినాటి ఫోటోను పోస్ట్ చేశారు. అంతేకాక ఓ అదిరిపోయే క్యాపన్ష్ ను కూడా ఆయన జోడించారు. ఈ ఫొటోను ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేస్తూ.. మనం వేడుక చేసుకోవడానికి మరో గ్రేట్ ఇండియన్ వెడ్డింగ్ ఇదని పేర్కొన్నారు. నవ్వుతున్న ఎమోజీని ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేశారు. ఇటీవల ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసింది. దాన్ని గుర్తు చేస్తూనే మరో గ్రేట్ ఇండియన్ వెడ్డింగ్ అని ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss