iDreamPost
android-app
ios-app

ద్యావుడా… ఇంత బోల్డ్ కంటెంటా? టీజర్ లోనే ఇలా ఉంటే..

  • Published Feb 24, 2024 | 9:37 PM Updated Updated Feb 24, 2024 | 9:37 PM

Mix-Up Movie Teaser: ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో మిక్సప్ అనే కొత్త సినిమా విడుదల కాబోతోంది. ఆ మూవీకి సంబంధించి టీజర్ రిలీజైంది.

Mix-Up Movie Teaser: ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో మిక్సప్ అనే కొత్త సినిమా విడుదల కాబోతోంది. ఆ మూవీకి సంబంధించి టీజర్ రిలీజైంది.

  • Published Feb 24, 2024 | 9:37 PMUpdated Feb 24, 2024 | 9:37 PM
ద్యావుడా… ఇంత బోల్డ్ కంటెంటా? టీజర్ లోనే ఇలా ఉంటే..

ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకు యునీక్ కంటెంట్ ఇవ్వాలి అని ఓటీటీ సంస్థలు కూడా తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే అన్ని జానర్స్ నుంచి మూవీస్ ని తీసుకుంటున్నారు. అలాగే ఒరిజినల్స్ అంటూ సొంతంగా కూడా మూవీస్, వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. అయితే వాటిలో బోల్డ్ కంటెంట్ కూడా ఒక భాగమే. ఈ జానర్లో ఎక్కువగా హాలీవుడ్, బాలీవుడ్ నుంచి మూవీస్ వస్తూ ఉంటాయి. తాజాగా తెలుగు నుంచి కూడా అలాంటి బోల్డ్ కంటెంట్ రాబోతోంది. ఆహా ఒరిజినల్ ఫిల్మ్ మిక్సప్ ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.

ఇప్పటికే ఆహా ఒరిజినల్ మూవీ మిక్సప్ కి సంబంధించి ఎప్పటి నుంచో ఓటీటీ, టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయడంతో అది మరో స్థాయికి చేరింది. దీనిని టాలీవుడ్ లస్ట్ స్టోరీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ నుంచి వచ్చిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ కి ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ మిక్సప్ మూవీకి ఆ ట్యాగ్ ఇస్తున్నారు. స్టోరీ, సీన్స్ అన్నీ లస్ట్ స్టోరీస్ కి దగ్గరగానే ఉన్నాయి. ఈ మూవీకి ఆకాశ్ బిక్కీ దర్శకత్వం వహించాడు. మిక్సప్ మూవీలో ఆదర్శ్, అక్షర గౌడ, కమల్, పూజా జే లీడ్ రోల్స్ ప్లే చేశారు.

ఈ టీజర్ లో దాదాపుగా కథ మొత్తాన్ని రివీల్ చేసినట్లు అనిపించింది. ఇద్దరు కపుల్స్ ఉంటారు. ఆ జంటల్లో ఒకరికి సె*క్స్ అంటే ఇంట్రస్ట్ ఉంటుంది. కానీ, రెండో వారికి మాత్రం శృంగారం అంటే అంత ఆసక్తి ఉండదు. ప్రేమ అనే ఎమోషన్ ని ఎక్కువ కోరుకుంటారు. ఇలా రెండు జంటల్లో ఒక భార్య, ఒక భర్త ఒకే రకమైన ఆసక్తి కలిగిన వాళ్లు ఒక్కటైతే? ఇలా నలుగురిలో ఒకే ఐడియాలజీ, ఆలోచనలు, కోరికలు కలిగిన వాళ్లను కలుసుకుంటే ఎలా ఉంటుంది అనేదే మిగిలిన కథ. కామవాంఛ.. ప్రేమపై విజయం సాధిస్తుందా? అంటూ ఇందులో స్టోరీ లైన్ క్లియర్ గా చెప్పేశారు. పైగా సె*క్స్ లైవ్, హస్బెండ్- వైఫ్ రిలేషన్, ఫాంటసీస్, డిజైర్స్ ఇలా చాలానే లేయర్స్ ని టచ్ చేశారు.

ఇలాంటివి ప్రస్తుత సమాజాంలో చూస్తూనే ఉన్నాం. ఇది కచ్చితంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీనే అవుతుంది. కాకపోతే నరేషన్ మాత్రం కాస్త బోల్డ్ గా ఉంటుందని చెప్పాలి. ఈ స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇందులో సీన్స్ మాత్రమే కాదు.. డైలాగ్స్ కూడా అంతే బోల్డ్ గా ఉన్నాయి. టీజర్ స్టార్టింగ్ లోనే డిస్ క్లైమర్ ని వేశారు. తప్పకుండా ఇయర్ ఫోన్స్ వాడండి.. ఇంట్లో వాళ్లకు దొరికిపోకుండా అని. మరి.. టీజరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో? ప్రస్తుతానికి ఈ టీజర్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. మార్చి 15న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మరి.. ఈ మిక్సప్ టీజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet