iDreamPost
android-app
ios-app

పండగవేళ రెండో హాస్యామృతం

  • Published Mar 13, 2020 | 6:03 AM Updated Updated Mar 13, 2020 | 6:03 AM
  • Published Mar 13, 2020 | 6:03 AMUpdated Mar 13, 2020 | 6:03 AM
పండగవేళ రెండో హాస్యామృతం

జీడిపాకం లాంటి మితిమీరిన సెంటిమెంట్లతో అర్థం లేని ఎమోషన్లతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే సీరియల్స్ మధ్య పేరుకు తగ్గట్టే నిజంగానే అమృతం కురిపించిన అమృత విలాస్ హాస్యపు జల్లులు మరోసారి సరికొత్త రూపంలో వ్యూయర్స్ ని తడిసిముద్దచేయనున్నాయి. రిపీట్ టెలికాస్ట్ లోనూ అద్భుతమైన రేటింగ్స్ సాధించి సున్నితమైన హాస్యాన్ని ఆరోగ్యవంతంగా చూపించిన సీరియల్ గా అమృతం ప్రతి తెలుగువారి హృదయాలలోనూ పదిలమైన స్థానాన్ని సంపాదించుకుంది. 300కు పైగా ఎపిసోడ్లతో అలరించిన అమృతం ఆ తర్వాత కొంత బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ అమృతం ద్వితీయం పేరుతో మార్చి 25నుంచి స్ట్రీమింగ్ లోకి రాబోతోంది.

ఉగాది పండగ సందర్భంగా రిలీజ్ కానున్న ఈ సిరీస్ తాలూకు ట్రైలర్ ని నిన్న విడుదల చేశారు. తెలివికి అదృష్టానికి ఆమడ దూరంలో ఉండే అమృతం, అంజి కథలకు ఆరవ సర్వర్ అతి తెలివిని జోడించి మరోసారి మేజిక్ చేయడం ఖాయమనిపించేలా ఉన్నారు. హోటల్ లో చేసే కామెడీతో పాటు ఇందులో బోలెడు తమాషాలు చాలా ఉన్నట్టు ట్రైలర్ లో చూపించేశారు. భయపడి ఎవడైనా బిలియనీర్ అవుతాడా తొందరపడి ఎవడైనా బెగ్గర్ అవుతాడా లాంటి ప్రశ్నలు రేకెత్తించి అమృతం 2 ఉద్దేశం ఏంటో దర్శక నిర్మాతలు చెప్పకనే చెప్పారు.

ఈతెలుగు రాష్ట్రాల్లో ఎవడైనా అతి చేయాలంటే మీ తర్వాతే అంటూ అమృతం అంజిల మీద కౌంటర్ వేయడం ద్వారా పాత్రల తీరుతెన్నులు కూడా చెప్పేశారు. హర్షవర్ధన్ టైటిల్ పాత్రను రిపీట్ చేస్తుండగా స్వర్గీయ గుండు హనుమంతరావు స్థానంలో ఎల్బి శ్రీరామ్ ను తీసుకొచ్చారు. ఒకరిద్దరు తప్ప అంతా పాత క్యాస్టింగే రిపీట్ అవుతోంది. ట్యూన్ కూడా అదే ఉంచేసి ఫీల్ పోకుండా కాపాడారు. అయితే టీవీ ప్రేక్షకులు మాత్రం ఇప్పటికిప్పుడు దీన్ని ఎంజాయ్ చేయలేరు. కేవలం జీ 5 యాప్ లో మాత్రమే అమృతం ద్వితీయం స్ట్రీమింగ్ చేయబోతున్నారు. జీ టీవీ ఛానల్ లో చూడాలంటే మాత్రం ఇంకొంత కాలం వేచి చూడక తప్పదేమో. దానికి సంబంధించిన ప్రకటన కానీ డేట్ కానీ ట్రైలర్ లో చూపించలేదు. సో సరదా సరదా నవ్వుల కోసం అమృతం అంజిలు చేసే అల్లరి సరికొత్త రూపంలో చూడాలంటె ఇంకో రెండు వారాలు వేచి చూస్తే చాలు.

Trailer Link @ bit.ly/2wQ8VOC

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom