iDreamPost
iDreamPost
ఒకప్పుడు ఇండియన్ కార్లలో రాజులాగా వెలిగింది అంబాసిడర్ కారు. గతంలో అంబాసిడర్ కారు ఉంటే, అందులో ప్రయాణిస్తే చాలా గొప్ప విషయం. భారతదేశాన్ని చాలా సంవత్సరాల పాటు ఈ అంబాసిడర్ కారు ఏలింది. తర్వాత మార్కెట్లోకి చాలా కంపెనీలు, చాలా కార్లు రావడంతో వాటితో పోటీ తట్టుకోలేక అంబాసిడర్ వెనక్కి వెళ్ళిపోయి పూర్తిగా కనుమరుగైంది. తాజాగా అంబాసిడర్ మళ్ళీ రాబోతుంది. కొత్త రూపులో, కొత్త టెక్నాలజీతో ఈ అంబాసిడర్ రాబోతుందని వార్త తెలియగానే అంతా ఇప్పుడు దాని గురించే చర్చించుకుంటున్నారు.
అంబాసిడర్ కార్లని తయారు చేసే హిందుస్థాన్ మోటార్స్ సంస్థ మళ్ళీ త్వరలో అంబాసిడర్ కి కొత్త రూపం ఇచ్చి మరింత కొత్త టెక్నాలజీతో తీసుకురాబోతున్నాము, ఇందుకు ఫ్రెంచ్‌కి చెందిన ప్యూగట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాము అని తెలిపింది. దీనికి సంబంధించిన కొన్ని డిజైన్స్ కూడా విడుదల చేసి కొత్తగా రాబోయే అంబాసిడర్ కారు ఇలా ఉండబోతుంది అని ప్రకటించారు. దీంతో ఈ కొత్త అంబాసిడర్ కారు ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
ఈ కారు గురించి ప్రముఖ ఇండస్ట్రియలిస్టు RPG గ్రూపు చైర్మన్ హార్ష్ గోయెంకా ట్విటర్‌లో స్పందిస్తూ… మిలీనియం ముందు తరం వాళ్లకు అంబాసిడర్ గురించి బాగా తెలుసు. అదొక గొప్ప కారు మాత్రమే కాదు, కుటుంబంలో ఓ భాగం కూడా. అలాంటి కారు మళ్లీ తిరిగి రావడం సంతోషకరం అంటూ ట్వీట్ చేశాడు. దీనికి బిర్లా కుటుంబానికి చెందిన వేదాంత్ బిర్లా స్పందిస్తూ.. అందరికి తెలియాల్సిన నిజం ఈ కారు బిర్లా వాళ్ళది. హిందుస్థాన్ మోటార్స్ మా అంకుల్ CK బిర్లా గారిది అని ట్వీట్ చేశాడు.
దీంతో ఇప్పటివరకు టాటా వాళ్ళకే కార్లు అనుకున్నారు, కానీ బిర్లా వాళ్ళకి కూడా కార్లు ఉన్నాయి, అది కూడా అందరూ మెచ్చే అంబాసిడర్ కారు బిర్లా వాళ్ళది అని తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ కొత్త అంబాసిడర్ కారు మరో రెండేళ్లలో మార్కెట్ లోకి రానుంది. చాలా మంది ప్రముఖులు ఈ కొత్త అంబాసిడర్ కారుని కొనడానికి ఇప్పటి నుంచే ఆసక్తి చూపిస్తున్నారు.
Little known fact is that this was a Birla car… HM belonged to my uncle Mr. CK #Birla!@hvgoenka 🙏 https://t.co/KhlnuxSg9l
— Vedant Birla (@birla_vedant) May 30, 2022