iDreamPost
android-app
ios-app

రెండో పెళ్లికి సిద్ధమైన అమలాపాల్.. కాబోయే భర్తను ముద్దులతో ముంచేసి..

  • Published Oct 26, 2023 | 4:45 PM Updated Updated Oct 26, 2023 | 4:45 PM

మాలీవుడ్ నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన మరో బ్యూటీ అమలాపాల్. తెలుగులో బడా హీరోలతోనే నటించింది. నాగ చైతన్య, నాని, రామ్ చరణ్, బన్నీ వంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది. అయితే గతంలో డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను వివాహం చేసుకుంది అమలా. కానీ విబేధాలు రావడంతో విడిపోయింది.. ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మాలీవుడ్ నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన మరో బ్యూటీ అమలాపాల్. తెలుగులో బడా హీరోలతోనే నటించింది. నాగ చైతన్య, నాని, రామ్ చరణ్, బన్నీ వంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది. అయితే గతంలో డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను వివాహం చేసుకుంది అమలా. కానీ విబేధాలు రావడంతో విడిపోయింది.. ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

  • Published Oct 26, 2023 | 4:45 PMUpdated Oct 26, 2023 | 4:45 PM
రెండో పెళ్లికి సిద్ధమైన అమలాపాల్.. కాబోయే భర్తను ముద్దులతో  ముంచేసి..

సినీ ఇండస్ట్రీలో వరుసగా భాజాలు, భజంత్రీలు మోగుతున్నాయి. మొన్నటికి మొన్న బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇటు టాలీవుడ్‌లోనూ ఓ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది. మెగా ఫ్యామిలీ వారసుడు వరుణ్ తేజ్.. నటి లావణ్య త్రిపాఠిలు వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. అదే సమయంలో టాలీవుడ్ స్టార్ వెంకీ మామ రెండవ తనయకు ఇటీవల నిశ్చితార్థం జరిగిన సంగతి విదితమే. ఇప్పుడు మరో పెళ్లి వార్త వినిపిస్తోంది. తెలుగు, తమిళ సినిమాలతో మెప్పించిన డస్కీ బ్యూటీ అమలా పాల్ మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. అవుననేలా ఇన్ స్టా గ్రామ్‌లో వీడియో దర్శనమిస్తోంది.

మలయాళ పరిశ్రమ నుండి తెలుగు తెరకు వచ్చిన మరో ముద్దుగుమ్మ అమలాపాల్. అయితే ఆమెకు గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం మైనా. తమిళ,మలయాళ సినిమాలు చేస్తూనే.. టాలీవుడ్ పరిశ్రమపై కూడా కన్నేసింది అమ్మడు. బెజవాడ సినిమాతో నాగ చైతన్య సరసన ఆడిపాడిన అమలాపాల్.. రామ్ చరణ్‌తో నాయక్, అల్లు అర్జున్‌తో ఇద్దరు అమ్మాయిలు, నానితో జెండాపై కపిరాజు వంటి చిత్రాల్లో మెరిసింది. 2014లో డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను వివాహమాడింది అమలాపాల్. ఆ పెళ్లి మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 2017లో విడాకులు తీసుకున్నారు ఈ జంట. అప్పటి నుండి ఆమె వైవిధ్య కథలను ఎంపిక చేసుకుంటూ వెళుతోంది. ఆడై చిత్రంలో ఆమె న్యూడ్‌గా నటించిన సంగతి విదితమే.

తన సోయగాలతో సోషల్ మీడియాను కూడా షేక్ చేస్తూ ఉంటోంది అమలాపాల్. అయితే విడాకులు అయ్యాక కూడా ఆమె సింగిల్ గానే ఉంటుంది అమలా. మాజీ భర్త విజయ్ మరో పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఆమె వివాహం చేసుకోలేదు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. గతంలో రెండో పెళ్లి చేసుకుందంటూ ఫోటోలు లీక్ కాగా, అది యాడ్ షూట్ అని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ప్రియుడ్ని అభిమానులకు పరిచయం చేసింది అమలా పాల్. తన పుట్టిన రోజు పురస్కరించుకుని ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తుంది ఈ బోల్డ్ బ్యూటీ. ఈ సందర్భంగా ఆమె ప్రియుడు.. అమలాను సర్ ప్రైజ్ చేశాడు. డ్యాన్స్ చేసి.. ఆమెకు క్యూట్ ప్రపోజల్ ముందు పెట్టాడు. ఆమె అంగీకరించడంతో రింగ్ ఆమె వేలికి తొడిగాడు.

అనంతరం ప్రియుడికి లిప్ లాక్స్ ఇచ్చింది అమలా. ఇంతకు ఆ ప్రియుడు, కాబోయే భర్త ఎవరంటే.. జగత్ దేశాయ్. వీరిద్దరూ గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియోను ఇద్దరూ షేర్ చేయగా.. జగత్ దేశాయ్.. చివరకు తన రాణి.. యస్ చెప్పిందని, వెడ్డింగ్ బెల్స్ అంటూ రాసుకొచ్చాడు. దీంతో అతడినే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, జగత్ గోవాకు చెందిన వ్యక్తి అని సమాచారం. లగ్జరీ విల్లాలో అతడు మేనేజర్ గా వ్యవహరిస్తున్నారడట. కొన్ని రోజుల క్రితం ఏర్పడ్డ స్నేహం, ప్రేమగా మారి, పెళ్లికి దారి తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమలా పాల్ ఆడుజీవితంతో పాటు మరో రెండు సినిమాలు చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Jagat Desai (@j_desaii)

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet giriş