iDreamPost
android-app
ios-app

Cadaver కడవెర్ రిపోర్ట్

  • Published Aug 16, 2022 | 12:16 PM Updated Updated Aug 16, 2022 | 12:16 PM
Cadaver కడవెర్ రిపోర్ట్

రామ్ చరణ్ నాయక్ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమలా పాల్(Amala Paul) గుర్తుందిగా. ఆ మధ్య దర్శకుడు విజయ్ ని పెళ్లి చేసుకుని తర్వాత విడాకుల దాకా వెళ్ళిపోయి కొంత బ్రేక్ తీసుకుని మళ్ళీ తెరమీద కనిపించడం మొదలుపెట్టారు. ఇటీవలే నిర్మాతగా కూడా మారారు. కడవెర్ (తెలుగు టైటిల్ ఇదే పెట్టేశారు)(cadaver) ని ప్రొడ్యూస్ చేసి ఇటీవలే డిస్నీ హాట్ స్టార్(Disney+ Hotstar) ద్వారా ఓటిటి రిలీజ్ ఇచ్చేశారు. ఈవిడే కీలక పాత్ర పోషించగా చీకటి గదిలో చితకొట్టుడు, కొండా ఫేమ్ ఆదిత్ అరుణ్(ఇప్పుడు త్రిగున్)మరో ముఖ్యమైన క్యారెక్టర్ పోషించారు. మొత్తం అయిదు భాషల్లో డిజిటల్ రిలీజ్ చేశారు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ కడవెర్ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం పదండి

సిటీలో ఓ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఎండి అతి దారుణంగా రోడ్డు మీద హత్య చేయబడతాడు. అతని శవాన్ని పోస్ట్ మార్టం చేసిన భద్ర (అమలా పాల్)కు విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. ఈ మర్డర్ చేసింది తనేనని జైల్లో శిక్ష అనుభవిస్తున్న వాసు(త్రిగున్) చెప్పడంతో కేసు కొత్త మలుపు తిరుగుతుంది. ఇదిలాగే కొనసాగుతుందని హెచ్చరిస్తాడు. విచారణ చేస్తున్న విశాల్(హరీష్ ఉత్తమన్)కు సైతం ఇది అంతు చిక్కని రీతిలో సమస్యవుతుంది. మరోవైపు కిరాతకంగా మరికొందరు చనిపోతారు. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, వాసు బయటికి రాకుండానే ఇన్ని దారుణాలు ఎలా చేస్తున్నాడు, అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది రెండు గంటల సినిమా చూసి తెలుసుకోవాలి.

ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కి దర్శకత్వం వహించింది అనూప్ ఎస్ పానికర్. మెయిన్ పాయింట్ కొత్తగా లేకపోయినా ప్రెజెంట్ చేసిన తీరు, స్క్రీన్ ప్లే రాసుకున్న విధానం మరీ రొటీన్ ఫీలింగ్ ఇవ్వదు. ముఖ్యంగా అసలైన హంతకుడిని రివీల్ చేసే క్రమం ఆసక్తికరంగా చూపించారు. వాసు భార్య ఎపిసోడ్ కొంత రొటీన్ ఫ్లేవర్ లో సాగినా దాని చుట్టూ ముడివేసిన సంఘటనల్లో మంచి టెంపో ఉండటంతో ఓ మోస్తరు వేగంగా గడిచిపోయింది. ఈ జానర్ ని విపరీతంగా ఇష్టపడే వాళ్లకు పర్లేదనిపిస్తుంది. టెక్నికల్ టీమ్ బాగా కష్టపడింది. చాలా తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. బెస్ట్ కాదు కాదు కా వీకెండ్ టైం పాస్ కోసం డీసెంట్ వాచ్ గా కడవెర్ ని ట్రై చేయొచ్చు