iDreamPost
android-app
ios-app

అల్లు అర్జున్ ముసుగేసుకుని మరీ థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తాడు..

  • Published Jun 04, 2022 | 6:00 PM Updated Updated Jun 04, 2022 | 6:00 PM
  • Published Jun 04, 2022 | 6:00 PMUpdated Jun 04, 2022 | 6:00 PM
అల్లు అర్జున్ ముసుగేసుకుని మరీ థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తాడు..

సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్స్ మామూలు జనాల్లా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళలేరు. ఎక్కడికైనా వెళ్తే అభిమానులు చుట్టుముట్టేసి ఎంత హడావిడి చేస్తారో తెలిసిందే. సెలబ్రిటీలు ఎక్కడికన్నా బయటకి వెళ్లి మామూలు ప్రజల్లా ఎంజాయ్ చేయాలంటే చాలా కష్టం. కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం మేము ఎందుకు ఎంజాయిమెంట్ చేయకూడదు అని ముసుగులు వేసుకొని సినిమాలకి, షికార్లకి వెళ్లి వస్తున్నారు.

ఇటీవల హీరోయిన్ సాయిపల్లవి ముసుగేసుకుని మరీ హైదరాబాద్ లోని ఓ థియేటర్ కి వెళ్లి సినిమా చూసి వచ్చింది. అయినా సినిమా చూసి బయటకి వచ్చే టైములో కొంతమంది గుర్తుపట్టి ఫోటోలు వీడియోలు తీయగా అవి వైరల్ గా మారాయి. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇలాగే ముసుగు వేసుకొని సినిమాలకి వెళ్లి వస్తాడు అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

శుక్రవారం రాత్రి నిర్వహించిన పక్కా కమర్షియల్ సినిమా ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ థియేటర్స్ గురించి మాట్లాడుతూ అందులో భాగంగా బన్నీ గురించి మాట్లాడాడు. అల్లు అరవింద్ బన్నీ గురించి మాట్లాడుతూ.. ”బన్నీ విదేశాలకు వెళ్లి నిన్నే ఇంటికి వచ్చాడు. F3 సినిమా చూడాలనుకొని ఇంట్లో ఉన్న క్యూబ్ థియేటర్ ఆన్ చేయబోతే థియేటర్‌కు వెళ్లి చూడమన్నాను. దీంతో నిన్న రాత్రి F3 సినిమాకు కూకట్‌పల్లిలో ఉన్న ఓ థియేటర్ కి వెళ్ళాడు బన్నీ. ప్రతిసారి బన్నీ సినిమాకి వెళ్లాలంటే కూకట్పల్లి లోని ఆ థియేటర్ కే వెళ్తాడు. సినిమా స్టార్ట్ అయ్యాక ముసుగు వేసుకుని లోపలికి వెళ్లి ఇంటర్వెల్‌లో కొంచెం ముందే బయటకు వచ్చి మళ్లీ లోపలికి వెళ్లి సినిమా మొత్తం చూసి అలాగే ముసుగేసుకుని బయటకి వచ్చేస్తాడు. ఇలా సినిమాలు చూడాలనిపించినప్పుడల్లా కూకట్పల్లి థియేటర్స్ కి వెళ్లి చూసొస్తాడు అని తెలిపారు. దీంతో బన్నీ ఫాన్స్ ఈ సారి ఎలాగైనా అల్లు అర్జున్ ని కనిపెట్టాలని ఫిక్స్ అయ్యారు. మొత్తానికి అల్లు అర్జున్ సీక్రెట్ ని ఇలా రివీల్ చేసేశారు అల్లు అరవింద్.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss