iDreamPost
android-app
ios-app

Allu Arjun : ఇంకో పాన్ ఇండియా ప్లాన్ లో బన్నీ

  • Published Jan 24, 2022 | 7:19 AM Updated Updated Jan 24, 2022 | 7:19 AM
  • Published Jan 24, 2022 | 7:19 AMUpdated Jan 24, 2022 | 7:19 AM
Allu Arjun : ఇంకో పాన్ ఇండియా ప్లాన్ లో బన్నీ

ఊహించిన దానికన్నా ఎక్కువ స్థాయిలో పుష్ప పార్ట్ 1 ది రైజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ పార్ట్ 2 మొదలుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచనే క్లారిటీ ఇంకా లేదు కానీ ఫిబ్రవరి చివరిలోపు స్టార్ట్ చేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ లోనే సీక్వెల్ విడుదలయ్యేలా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది. నార్త్ ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ఇప్పుడీ రెండో భాగంలో కొన్ని కీలకమైన మార్పులతో పాటు బాలీవుడ్ క్యాస్టింగ్ ని జోడించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. బిజినెస్ పరంగానూ రేంజ్ పెరగడంతో ఆ మేరకు బడ్జెట్ కూడా చాలా పెంచేశారని తెలిసింది.

ఇక అసలు విషయానికి వస్తే పుష్ప తర్వాత బన్నీ ఎవరితో చేస్తాడనే క్లారిటీ ఇప్పటిదాకా లేదు. బోయపాటి శీనుతో అన్నారు కానీ ఆయన క్లియర్ గా ఏదీ తేల్చడం లేదు. అఖండ అంత పెద్ద హిట్ అయినప్పటికీ కథ లేకనో మరో కారణమో తెలియదు కానీ ప్రకటన ఆలస్యమవుతోంది. పైగా అఖండకు సీక్వెల్ ఉంటుందని బోయపాటి ఆల్రెడీ హింట్ ఇచ్చాడు కాబట్టి ఒకవేళ అదేమైనా ఉంటుందేమో వేచి చూడాలి. ఈలోగా ఒక హాట్ అప్ డేట్ అభిమానుల్లో డిస్కషన్ టాపిక్ గా మారింది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ ఓ పాన్ ఇండియా మూవీ ప్లానింగ్ లో ఉన్నారనే లీక్ సోషల్ మీడియాలో గట్టిగానే తిరుగుతోంది.

అట్లీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే . ఇందులో నయనతార హీరోయిన్. ఇది పూర్తవ్వడానికి ఎంత లేదన్నా ఆరేడు నెలలు పడుతుంది. ఆలోగా పుష్ప 2 అయిపోతుంది కాబట్టి ఈ కాంబినేషన్ సెట్ చేయడం కష్టమేమి కాదు. పైగా ఇప్పుడు వచ్చిన గుర్తింపుకి బన్నీ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ముందు ఓకే చెప్పిన వేణు శ్రీరామ్ ఐకాన్ ని పక్కన పెట్టారు. తిరిగి ఉంటుందో లేదో నిర్మాత దిల్ రాజు సైతం చెప్పలేకపోతున్నారు. విజయ్ తో కమర్షియల్ మాస్ సూపర్ హిట్స్ ఇచ్చిన అట్లీతో నిజంగా అల్లు అర్జున్ జట్టు కడితే అంతకన్నా క్రేజీ కలయిక అభిమానులకు ఇంకేముంటుంది.

Also Read : Good Luck Sakhi : బ్యాడ్ లక్ నుంచి గుడ్ లక్ దాకా కీర్తి ప్రయాణం

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio