iDreamPost
iDreamPost
ఐకాన్ స్టార్ గా, పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన అల్లు అర్జున్‌కి గొప్ప గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(FIA) నిర్వహించిన ఇండియా డే పరేడ్‌కు ఆయన నాయకత్వం వహించారు. NYC మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఇండియా డే పరేడ్‌లో అర్జున్‌ను గ్రాండ్ మార్షల్‌గా సత్కరించారు. మేయర్‌తో కలిసి పుష్ప ఐకానిక్ మూవ్‌ను ప్రదర్శించాడు
ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫోటోలును పోస్ట్ చేశాడు, “న్యూయార్క్ సిటీ మేయర్‌ని కలవడం చాలా ఆనందంగా ఉంది. చాలా స్పోర్టివ్ జెంటిల్‌మన్. ఆనర్స్ మిస్టర్ ఎరిక్ ఆడమ్స్ ధన్యవాదాలు. తగ్గేదే లే ! @ericadamsfornyc.”
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఈ ర్యాలీని నిర్వహించింది. దీనికి గ్రాండ్ మార్షల్ అల్లు అర్జున్. ప్రముఖులకు మాత్రమే ఈ హోదా దక్కుతుంది. పరేడ్ ను ఉత్సాహంగా నడిపించిన అల్లు అర్జున్ ‘యే భారత్‌కా తిరంగా హై.. కబీ ఝుకేగా నహీ..తగ్గేదేలే’.. అంటూ పుష్ప డైలాగ్ వినిపించాడు.
గ్రాండ్ మార్షల్‌గా వ్యవహిరించిన ఐకాన్ స్టార్ అల్లురన్‌కి న్యూయార్క్ మేయర్ ఆమమ్స్ సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్ బహుకరించాడు. అల్లు అర్జున్ రావడంతో న్యూయర్క్ వీధుల నిండా ప్రవాస భారతీయులే. అసోసియేషన్ ఛైర్మన్ అంకుర్ వైద్య సహా, ప్రవాస భారతీయ సంఘాల ప్రతినిధులు , ఎన్నారైలు ర్యాలీలో పాల్గొన్నారు.