iDreamPost
android-app
ios-app

బన్నీ ఈ నెగిటివిటీని పట్టించుకోవాల్సిందే

  • Published Dec 21, 2022 | 11:43 AM Updated Updated Dec 11, 2023 | 11:48 AM

అందుకే బాహుబలి రేంజ్ లో ఎక్కువ టైం తీసుకుని మరీ దర్శకుడు సుకుమార్ పుష్ప 2ని చెక్కుతున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ లో ఓ పది రోజుల షూటింగ్ పూర్తి చేసేశారు. విడుదల ఇప్పుడప్పుడే ఉండే అవకాశం లేదు కాబట్టి ఆర్టిస్టుల కాల్ షీట్స్ ని బట్టి నెక్స్ట్ ప్లానింగ్ ఉండనుంది.

అందుకే బాహుబలి రేంజ్ లో ఎక్కువ టైం తీసుకుని మరీ దర్శకుడు సుకుమార్ పుష్ప 2ని చెక్కుతున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ లో ఓ పది రోజుల షూటింగ్ పూర్తి చేసేశారు. విడుదల ఇప్పుడప్పుడే ఉండే అవకాశం లేదు కాబట్టి ఆర్టిస్టుల కాల్ షీట్స్ ని బట్టి నెక్స్ట్ ప్లానింగ్ ఉండనుంది.

బన్నీ ఈ నెగిటివిటీని పట్టించుకోవాల్సిందే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ పుష్పకు ముందు ఆ తర్వాత అన్నట్టు చాలా వేగంగా ప్యాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది. ఆ సినిమా హిందీలో బ్లాక్ బస్టర్ కావడంతో సెకండ్ పార్ట్ మీద ఏ స్థాయిలో అంచనాలు పెంచిందో తెలిసిందే. అందుకే బాహుబలి రేంజ్ లో ఎక్కువ టైం తీసుకుని మరీ దర్శకుడు సుకుమార్ పుష్ప 2ని చెక్కుతున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ లో ఓ పది రోజుల షూటింగ్ పూర్తి చేసేశారు. విడుదల ఇప్పుడప్పుడే ఉండే అవకాశం లేదు కాబట్టి ఆర్టిస్టుల కాల్ షీట్స్ ని బట్టి నెక్స్ట్ ప్లానింగ్ ఉండనుంది. అయితే కమర్షియల్ సినిమాలతోనే ఇంత సక్సెస్ సాధించిన బన్నీ సోషల్ మీడియాలో తనకెదురవుతున్న ట్రోలింగ్ గురించి ఆలోచించాలి

రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ 18 పేజెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్ళాడు. బ్యానర్ స్వయానా తండ్రిదే కాబట్టి నో చెప్పడానికి లేదు. సరే రావడం మంచిదే. అయితే బన్నీకి క్యారవాన్ దిగినప్పటి నుంచి స్టేజి ఎక్కే దాకా ఈవెంట్ ఆర్గనైజర్స్ ప్లాన్ చేసిన హడావిడి కొంచెం ఓవర్ గా అనిపించడంతో ట్విట్టర్ లో యాంటీ ఫ్యాన్స్ కి ట్రోల్ చేయడానికి అవకాశం దక్కింది. దానికి తోడు ఆ మధ్య స్వయానా తమ్ముడు శిరీష్ ఊర్వశివో రాక్షసివోకు వెళ్ళినప్పుడు సైతం వచ్చిన అతిథులు మొదలుకుని ఆ సినిమాల నటించిన ఆర్టిస్టుల దాకా అందరూ పుష్ప నామజపమే చేయడంతో అదసలు మూవీ ఈవెంటా లేక బన్నీ ఎలివేషన్ ప్రోగ్రామా అనే డౌట్ వచ్చింది.
Bunny has to ignore this negativity
ఇప్పుడు తనున్న స్థాయిలో అల్లు అర్జున్ కి ఇవన్నీ అవసరం లేదు. ఏదో సహజంగా జరిగితే ఒక కానీ అదే పనిగా ఏదో పొగడటమే లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్నవి కృత్రిమంగానే అనిపిస్తాయి. బన్నీ ఇదంతా లైట్ తీసుకోవాలి. ఎందుకంటే తన ఇమేజ్ తెలుగు రాష్ట్రాలు, కేరళ దాకా నార్త్ దాకా వెళ్లిపోయింది. తగ్గేదెలా మ్యానరిజమ్, పాటలు అన్నీ పబ్లిక్ లోకి బాగా వెళ్ళాలి. సైలెంట్ గా ఉన్నా టాక్ ఫర్ ది టాపిక్ గా ఉన్నాడు. అలాంటప్పుడు ఇవన్నీ దేనికనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. 2024లో విడుదలకు ప్లాన్ చేసుకున్న పుష్ప 2 అంతకన్నా ముందు వచ్చే సూచనలు కనిపించడం లేదు. దీని తర్వాత సినిమాని ఐకాన్ స్టార్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు