Dharani
గత కొన్ని రోజులుగా మీడియాలో.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ చేస్తోన్న మోసాలపై వరుస కథనాలు వెలువడుతున్నాయి. సామాన్యులను వీరు ఎలా మోసం చేస్తున్నారో.. ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు కొందరు. ఆ వివరాలు..
గత కొన్ని రోజులుగా మీడియాలో.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ చేస్తోన్న మోసాలపై వరుస కథనాలు వెలువడుతున్నాయి. సామాన్యులను వీరు ఎలా మోసం చేస్తున్నారో.. ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు కొందరు. ఆ వివరాలు..
Dharani
ఇది సోషల్ మీడియా యుగం అని చెప్పవచ్చు. నేటి కాలలంలో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఇక సోషల్ మీడియా అనేది సామాన్యులకు వరంగా మారింది. రాత్రికి రాత్రే సూపర్ స్టార్‌గా మారే అవకాశం కల్పిస్తోంది. మంచి కంటెంట్ ఇస్తే.. ప్రేక్షకులు త్వరగా కనెక్ట్ అవుతారు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వచ్చాక వారికి ప్రేక్షకులతో కనెక్టీవిటీ పెరగడం మాత్రమే కాక.. ఆదాయం కూడా భారీగానే వస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అనేవి సామాన్యులకు ప్రధాన ఆదాయ వనరుగా మారగా.. సెలబ్రిటీలకు సెకండ్ ఇన్‌కమ్‌గా మారింది. ఇక కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్స్ ఆదాయం చూస్తే కళ్లు చెదిరిపోతాయి. వారు ఖర్చు చేసే విధానం.. లైఫ్ స్టైల్, వంటివి చూస్తే.. ఎంతో లగ్జరీగా ఉంటాయి. ఇక వీరిని చూస్తే.. నిజంగానే సోషల్ మీడియాలో ఇంత భారీ ఎత్తున ఆదాయం వస్తుందా అనే అనుమానం రాకపోదు.
అయితే తాజాగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ మీద కొందరు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. వీరు పేదలకు ఇచ్చే డబ్బు కష్టపడి సంపాదించింది కాదని.. సామాన్యులను మోసం చేస్తూ.. తమ ఫాలోవర్లను తప్పుదోవపట్టిస్తూ.. లక్షల్లో ఆదాయం పొందుతూ.. పైకి మాత్రం సమాజానికి ఏదో సేవ చేస్తున్నట్లు ఫోజులు కొడుతూ.. గొప్ప వారిగా గుర్తింపు పొందుతున్నారని మీడియా సాక్షిగా ఆరోపిస్తున్నారు. వీరిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ మాత్రమే కాక.. సినీ సెలబ్రిటీలు కూడా ఉండటం గమానార్హం. వీరంతా సామాన్యులను ఎలా మోసం చేస్తున్నారో ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు కొందరు.
ఈ సెలబ్రిటీలకు, ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సోషల్ మీడియా వల్ల వచ్చే ఆదాయం చాలా తక్కువ అని చెబుతున్నారు. మరి వారేలా లక్షలు ఖర్చు చేయగల్గుతున్నారంటే.. బెట్టింగ్ యాప్స్ మహత్యం అంటున్నారు. నేటి కాలంలో చాలా మంది ఇన్‌ఫ్లూయెన్సర్స్, సెలబ్రిటీలు.. వారి సోషల్ మీడియా పోస్టులు, వీడియోల్లో.. ముందుగానే అనేక బెట్టింగ్ యాప్స్, ట్రేడింగ్ యాప్స్, సరోగేట్ యాడ్స్ గురించి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకు గాను వారు లక్షల రూపాయలు వసూలు చేస్తూ.. సామాన్యులను మోసం చేస్తున్నారంటూ కొందరు మీడియా వేదికగా.. ఆధారలతో సహా నిరూపిస్తున్నారు. అసలు యూట్యూబ్ వీడియో వ్యూస్‌కు వచ్చే ఆదాయం చాలా తక్కువ అని.. కానీ ఇలా బెట్టింగ్, ట్రెడింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం వల్ల లక్షల రూపాయలు వస్తాయని వెల్లడిస్తున్నారు. కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్.. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం కోసం 50-80 లక్షలు తీసుకుంటారని సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ ఇలా సంపాదించుకునే ఆదాయం మీద ఎలాంటి రైడ్స్ జరగవని.. వీరికి ఒక్కొక్కరికి 20, 30 ఖాతాలుంటాయని.. వీటి ద్వారా లక్షల ఆదాయం సంపాదిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇన్‌ఫ్లూయెన్సర్స్ మాటలు నమ్మి చాలా మంది బెట్టింగ్ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుని.. వాటిల్లో డబ్బులు పెట్టి.. భారీగా నష్టపోయి.. ప్రాణాలు తీసుకుంటున్నారని.. ఇప్పటికైనా ప్రభుత్వాలు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.