iDreamPost
android-app
ios-app

అఖిల్ కు ముగ్గురితో యుద్ధం

  • Published Oct 02, 2021 | 7:52 AM Updated Updated Oct 02, 2021 | 7:52 AM
అఖిల్ కు ముగ్గురితో యుద్ధం

ఈ నెల 15న విడుదల కాబోతున్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మీద అభిమానులు ఏ స్థాయిలో నమ్మకం పెట్టుకున్నారో తెలిసిందే. ఇటీవలే వచ్చిన ట్రైలర్ అంచనాలను ఆకాశానికి తీసుకుపోలేదు కానీ ఉన్నంతలో మంచి యూత్ ఎంటర్ టైనర్ చూడొచ్చన్న నమ్మకాన్ని కలిగించింది. చాలా కాలంగా సక్సెస్ కి దూరంగా ఉన్న అఖిల్ కి ఇది హిట్ కావడం చాలా అవసరం. మొదటి ఐదేళ్లలో చేసిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను మూడూ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోవడం ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో గత నెల అన్నయ్య నాగ చైతన్య లవ్ స్టోరీ తరహాలో ఇప్పుడు తమ్ముడు కూడా అదే రిజల్ట్ కొట్టాలని కోరుకుంటున్నారు.

సోలోగా వస్తే అఖిల్ కు కొంత అడ్వాంటేజ్ ఎక్కువ ఉండేది కానీ ఈసారి బాక్సాఫీస్ పోటీ అంత ఈజీగా కనిపించడం లేదు. సరిగ్గా అదే రోజు శ్రీకాంత్ కొడుకు రోషన్ పెళ్ళిసందడి కూడా రాబోతోంది. ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ స్టాంప్ తో వస్తున్న ఈ సినిమాకు టాక్ కనక బాగా వస్తే కుటుంబ ప్రేక్షకులను ఇది తనవైపు లాక్కుంటుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ కాబట్టి తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇక నాగ శౌర్య వరుడు కావలెను కూడా ఇప్పటికైతే అదే డేట్ అన్నారు కానీ తాజాగా 29కి పోస్ట్ పోన్ కావొచ్చని ఇన్ సైడ్ టాక్. లేదూ క్లాష్ కి సిద్ధమంటే మాత్రం ఇదీ వినోదాన్ని నమ్ముకునే వస్తున్న సినిమా కాబట్టి కాంపిటీషన్ గట్టిగానే ఉంటుంది.

వీటికన్నా ముందు ఒక్కరోజు ముందే 14న శర్వానంద్ సిద్దార్థ్ ల మహా సముద్రం రాబోతోంది. ఆరెక్స్ 100 అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ లవ్ కం యాక్షన్ ఎంటర్ టైనర్ ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. సెటప్ అదీ చూస్తుంటే మాస్ కి బాగా కనెక్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది కనక హిట్ టాక్ అనుకుంటే కేవలం ఒక్క రోజు గ్యాప్ తో వచ్చే బ్యాచిలర్ అండ్ ఇతర సినిమాలకు కలెక్షన్ల పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. దసరాకు ఈసారి సంక్రాంతి టైపు లో భారీ హీరోలవి కాకుండా మీడియం రేంజ్ స్టార్ల మధ్య పోటీకి వేదిక మారబోతోంది. విశాల్ ఎనిమి కూడా 13 అనుకున్నారు కానీ ఫైనల్ గా అది దీపావళికి షిఫ్ట్ అయ్యింది.

Also Read :  పవన్ మహేష్ లు ఏం చేయబోతున్నారు