iDreamPost
android-app
ios-app

175 రోజులు.. ఆ థియేటర్లో ఇంకా నడుస్తున్న బాలయ్య ‘అఖండ’.. సరికొత్త రికార్డ్..

  • Published May 23, 2022 | 6:39 PM Updated Updated May 23, 2022 | 6:39 PM
  • Published May 23, 2022 | 6:39 PMUpdated May 23, 2022 | 6:39 PM
175 రోజులు.. ఆ థియేటర్లో ఇంకా నడుస్తున్న బాలయ్య ‘అఖండ’.. సరికొత్త రికార్డ్..

కరోనా సెకండ్ లాక్ డౌన్ తర్వాత ధైర్యంగా థియేటర్లలో రిలీజ్ చేశారు బాలయ్యబాబు తన అఖండ సినిమాని. అఖండ సినిమా ఎంతటి విధ్వంస విజయం సాధించిందో అందరికి తెలిసిందే. బాలయ్య బాబు యాక్షన్, మాస్, తమన్ అదిరిపోయే BGM, బోయపాటి టేకింగ్ ఇవన్నీ కలిసి అఖండ సినిమాని వేరే లెవెల్లో నిలబెట్టాయి. హిందూ ధ‌ర్మాలు, హిందు టెంపుల్స్ గురించి చెప్పడంతో ఇది మరింత బలం చేకూర్చింది సినిమాకి.

ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు బాలయ్య అభిమానులతో పాటు సినీ ప్రేమికులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అన్ని థియేటర్లు జై బాలయ్య అంటూ పూనకాలతో ఊగిపోయాయి. మన దేశంలోనే కాక ఆస్ట్రేలియా, అమెరికా లాంటి ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా అదరగొట్టేసింది. ఇక బాలయ్య కెరీర్లోనే మొట్టమొదటి సారి 100 కోట్లకు పైగా సాధించిన సినిమాగా నిలిచి రికార్డ్ సృష్టించింది అఖండ సినిమా.

ఈ రోజుల్లో సినిమా వారం రోజులు ఆడటమే ఎక్కువ. మూడు రోజులకే కలెక్షన్స్ లెక్కపెట్టేసి వీకేండ్ అవగానే సినిమాని పక్కన పెట్టేస్తున్నారు. కానీ అఖండ వీటన్నిటిని ఎదుర్కొని 50 రోజుల వేడుకని చాలా థియేటర్లలో చేసుకొని కొన్ని సంవత్సరాల తర్వాత 50 రోజుల వేడుకని అఖండ సినిమాతో చూశామన్నారు. అంతే కాక 100 రోజుల వేడుకని కూడా పలు థియేటర్లలో చేసుకుంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర్నుంచి ఏకంగా 175రోజులు ఓ థియేటర్లో ఆడింది.

చిల‌క‌లూరిపేటలో ఉన్న రామకృష్ణ థియేట‌ర్లో అఖండ 175రోజులు పూర్తి చేసుకుంది. దీనిపై థియేట‌ర్ యాజ‌మాన్యం మాట్లాడుతూ.. సినిమా విడుద‌లై ఇన్ని రోజులైనా ప్రేక్షకాద‌ర‌ణ ఏ మాత్రం తగ్గలేదు, కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. ఈ సినిమాని 200 రోజులకు తీసుకెళతాం అని చెప్పారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో 175 రోజులు ఆడటం అంటే మామూలు విషయం కాదు, అఖండ మరో సరికొత్త రికార్డ్ సృష్టించింది అని అంటున్నారు. ఇక బాలయ్య అభిమానులు ఈ వార్త విని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ