iDreamPost
android-app
ios-app

బాలయ్యతో బాబు – నమ్మే నిజాలేనా?

  • Published Oct 12, 2022 | 10:48 AM Updated Updated Oct 12, 2022 | 10:48 AM
  • Published Oct 12, 2022 | 10:48 AMUpdated Oct 12, 2022 | 10:48 AM
బాలయ్యతో బాబు – నమ్మే నిజాలేనా?

గత ఏడాది నందమూరి బాలకృష్ణ మొదటిసారి యాంకర్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ టాక్ షో ఎంత పెద్ద హిట్టో చూశాం. ఆహాకు మంచి మైలేజ్ తీసుకొచ్చిన ప్రోగ్రాంస్ లో ఇదీ ఒకటి. మాములుగా సినిమాలు కాకుండా బయట కెమెరా ముందు తడబడుతూ మాట్లాడే బాలయ్య చాలా స్పాంటేనియస్ గా నిర్వహించిన తీరు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు దీని రెండో సీజన్ ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈసారి ఇండస్ట్రీ సెలబ్రిటీలను కాకుండా స్వయానా బావా కం వియ్యంకుడు కం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుని తీసుకొచ్చారు బాలయ్య. షూటింగ్ కు ముందే ఈ విషయం లీకైపోయింది కాబట్టి ఆడియన్స్ లో అంత థ్రిల్ ఏమీ అనిపించలేదు.

దీని తాలూకు అయిదు నిమిషాల ప్రత్యేక ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో బాబు బాలయ్యలు చాలా ఉత్సాహంగా మాట్లాడుకున్నారు కానీ కొన్ని విషయాలకు సంబంధించి ఎంత మేరకు ఓపెన్ అయ్యారనేది జనంలో ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వైనం, అప్పటి రాజకీయ పరిణామాలు, తండ్రి వైపు కాకుండా బాలకృష్ణ చంద్రబాబు వైపు ఉండటం లాంటి సంఘటనల పట్ల సామాన్యుల్లో ఇప్పటికీ ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ లోనే పైపై పూతలతో మేనేజ్ చేసిన నందమూరి హీరో ఇప్పుడు నిజాలు చెప్పగలరా. ఎందుకంటే ఎన్టీఆర్ బాబుని పై చేసిన తీవ్ర వ్యాఖ్యల తాలూకు వీడియోలు సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తూనే ఉంటాయి.

వీళ్లిద్దరే కాదు లోకేష్ ఎంట్రీ కూడా ఈ ఎపిసోడ్ లోనే పొందుపరిచారు. విదేశాల్లో స్విమ్మింగ్ పూల్ లో స్నేహితులతో ఇచ్చిన ఫోటోను చూపిస్తూ ఇది అసెంబ్లీ దాకా వెళ్లిందని బాలయ్య అనడం, మామకు లేని డౌట్ నాకెందుకని బాబు కవర్ చేయడం ఇవనీ ఫ్యాన్స్ కోణంలో బాగానే అనిపిస్తాయి కానీ రియాలిటీ ఏంటనేది షో చూస్తే కానీ అర్థం కాదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇద్దరి నటన ఎన్టీఆర్ ని మించిపోయేలా సాగిందని మీమ్స్ ట్రోల్స్ ని మొదలుపెట్టేశారు. పాజిటివో నెగటివో మొత్తానికి ఈ ప్రోమోని హాట్ టాపిక్ చేసేశారు. మరి లక్ష్మి పార్వతితో రెండో పెళ్లి, అన్న హరికృష్ణ అప్పట్లో వేరు కుంపటి పెట్టడం వీటి ప్రస్తావన ఎంతవరకు ఉంటుందో లెట్ వెయిట్ అండ్ సీ

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio