iDreamPost
android-app
ios-app

సెన్సార్ పూర్తి చేసుకున్న అజ్ఞాత‌వాసి

  • Published Jan 03, 2018 | 2:36 AM Updated Updated Jan 03, 2018 | 2:36 AM
సెన్సార్ పూర్తి చేసుకున్న అజ్ఞాత‌వాసి

  ప‌వ‌ర్‌స్టార్ 25వ చిత్రం ‘అజ్ఞాత‌వాసి’ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ఇక వార‌మే స‌మ‌య‌మున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌వ‌న్ మేనియా ఊపేస్తోంది. డిసెంబ‌ర్ 31న కొత్త సంవ‌త్స‌రం కానుక‌గా విడుద‌లైన ‘కొడ‌కా… కోటేశ్వ‌ర‌రావు’ పాట విన్నాక మెగాభిమానుల సంతోషానికి అవ‌ధులేలేవ‌ని చెప్పాలి. ఈ పాట‌ను ప‌వ‌న్‌కల్యాణ్ స్వ‌యంగా పాడ‌టం విశేషం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ చూసినా సెల్‌ఫోన్ల‌లో ఇదేపాట మారుమోగుతోందంటే  ఈ పాట యూత్‌లోకి ఎలా వెళ్లిపోయిందో అర్థం చేసుకోవ‌చ్చు. 

          ఇదిలా ఉండ‌గా పవర్‌స్టార్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన‌ ‘అజ్ఞాతవాసి’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీనికి ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీచేశారు. సో… జనవరి 10 న  ప‌వ‌న్ సంద‌డిని చూసేందుకు ఇక ఏ అడ్డంకులూ లేన‌ట్టేన‌న్న‌మాట‌. సంక్రాంతి బ‌రిలోకి దిగుతున్న ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా సీనియర్ నటి కుష్బూ ముఖ్యపాత్రలో నటిస్తున్న విష‌యం తెలిసిందే..!

gamdomCasibommarsbahis girişMarsbahisJojobet Girişjojobetjojobet giriş