iDreamPost
android-app
ios-app

అల్లు అర్జున్ తో శ్రీలీల, మెంటల్ ఎక్కిస్తున్న క్రేజీ కాంబినేషన్

  • Published Jun 14, 2023 | 3:34 PM Updated Updated Jun 14, 2023 | 3:38 PM
  • Published Jun 14, 2023 | 3:34 PMUpdated Jun 14, 2023 | 3:38 PM
అల్లు అర్జున్ తో శ్రీలీల, మెంటల్ ఎక్కిస్తున్న క్రేజీ కాంబినేషన్

కన్నడ భామ శ్రీలీల గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు ఈ అమ్మడు పరిచమైంది. తొలి సినిమాతోనే టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు పొందింది.  ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకుంది.  నేడు ఈ కన్నడ బ్యూటీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ బ్యూటీ అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అంటూ క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది.

ఇప్పటికే పలువురు రవితేజతో నటించిన ఈ అమ్మడు… పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌, బాలకృష్ణ వంటి స్టార్లతో కూడా కలిసి నటిస్తోంది. తాజాగా బన్నీతోనూ వర్క్ చేసే ఛాన్స్ రావడం విశేషమనే చెప్పాలి. `ఆహా` ఓటీటీ సంస్థ కోసం అల్లు అర్జున్, శ్రీలీల కలిశారని సమాచారం. వీరిని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్ట్ చేయనున్నారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది టీమ్‌. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్‌ సంకనెక్కి శ్రీలీల కూర్చుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. శ్రీలీలకి ఈ పోస్టర్ బెస్ట్ ట్రీట్‌ అని చెప్పొచ్చు. అయితే అల్లు అర్జున్, శ్రీలీలాతో వెబ్‌ సిరీస్‌ చేస్తారా? లేకా ఓటీటీ ఫిల్మ్ చేస్తారా? అనేది పెద్ద సస్పెన్స్.

కానీ సినీ వర్గాల సమాచారం ప్రకారం.. బన్నీ, శ్రీలీల మీద ఒక యాడ్‌ షూట్‌ చేస్తున్నారంట. ఆహాలో బన్నీ కొత్తగా `ఆహా ఒరిజినల్స్` ని లాంచ్‌ చేయబోతున్నారట. ఇందులో పలు వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు నిర్మించబోతున్నారట. దాని ప్రమోషన్స్ కోసమే అల్లు అర్జున్‌, శ్రీలీల లపై ప్రమోషనల్‌ యాడ్ చేస్తున్నారని టాక్‌. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వీరిద్దరికి సంబంధించిన పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. బన్నీ ఫ్యాన్స్ మస్తు ఖుషి అవుతున్నారు. మరి.. వైరల్ అవుతున్న ఈ జోడీ పోస్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet