iDreamPost
android-app
ios-app

భలే మాయ చేసిన శ్రియ.. పాప పుడితే ఏడాది దాచేసింది!

భలే మాయ చేసిన శ్రియ.. పాప పుడితే ఏడాది దాచేసింది!

సాధారణంగా సినీ సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా తన అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే తమ పర్సనల్ విషయాలు చాలా గోప్యంగా ఉంచుతూ వస్తారు. ఇప్పుడు శ్రియ కూడా జీవితంలో చాలా ముఖ్యమైన విషయాన్ని సీక్రెట్ గా ఉంచి వార్తల్లోకెక్కింది. 2018 లో తన ప్రియుడు ఆండ్రీ కొఛీవ్ ను పెళ్లి చేసుకున్న శ్రియ.. అప్పట్నుంచి ఆయనతో కలిసి మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ అభిమానులతో పంచుకుంటూ ఉండే శ్రియాశ‌ర‌ణ్ తాను గర్భం దాల్చి పాపకు జన్మినిచ్చిన సంగతి మాత్రం బయట పెట్టలేదు. సాధారణంగా ఏదైనా ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తే వాటిలో బాడీని చూసి ఏమైనా తేడాలు ఉన్నాయేమో ఇట్టే పసిగడతారు అభిమానులు, అందుకే చాలా తెలివిగా అలాంటి అనుమానం కలిగించే ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు శ్రియ.

అప్పటికే తన దగ్గర ఉన్న పాత వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను మాయ చేసింది. అయితే ఆమె తల్లయిన సంగతి బయటికి కూడా రాకుండా ఏడాది పైగా దాచేసిన శ్రియ ఇప్పుడు తను పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి అభిమానులతో పంచుకుంది. తాను తల్లైన విషయం గురించి చెబుతూ 2020 మొత్తం ప్రపంచాన్ని తలకిందులు చేసిందని, కరోనా వ్యాప్తి కారణంగా అంతా సంవత్సరం పాటు క్వారంటైన్‌లో వెళ్లిపోగా తమ జీవితాలలో మాత్రం ఓ అద్భుతం జరిగిందని చెప్పుకొచ్చింది. దేవుడు మాకు ఒక ఏంజిల్‌ లాంటి చిన్నారిని ప్రసాదించాడని, అందుకు నా భర్తకు రుణపడి ఉంటానని శ్రియ పేర్కొంది. చిన్నారి రాకతో మా జీవితంలో ఓ అద్భుతం జరిగిందని చెబుతూ భర్తతో పాపా ఆడుకుంటున్న వీడియోను షేర్ చేసింది.

ఇక నిజంగా ఏడాది పాటు పాప గురించి దాచడం అనేది మామూలు విషయం కాదు కదా. గతేడాది స్పెయిన్‌లోని బార్సిలోనాలో శ్రియ తల్లయింది అంటున్నరు. కరోనా లాక్ డౌన్ కు ముందు అక్కడికి హాలిడే ట్రిప్ కోసం వెళ్లగా లాక్ డౌన్ కారణంగా అక్కడే ఉండి పోయారు. ఏడాది పాటు అక్కడే ఉన్న ఈ జంట ఆ సమయంలోనే పాపకు జన్మనిచ్చినట్టు చెబుతున్నారు. ఈ మధ్యే మళ్లీ ఇండియా తిరిగి వచ్చిన ఈ జంట ముంబైలో ఇల్లు కొనుక్కుని ఇక్కడే ఉంటున్నారు. మొన్నీమధ్య తిరుమలలో కూడా కనిపించిన శ్రియ అప్పుడు కూడా ఒంటరిగానే కనిపించింది.

Also Read : సరోగేట్ అడ్వర్టైజింగ్ బారిన పడ్డ బిగ్ బీ.. అసలు విషయం తెలియడంతో బైబై!

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet Girişcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet GirişHoliganbetHoliganbet Giriş