సాధారణంగా చిత్ర పరిశ్రమకు చెందిన వారి పిల్లలు.. సినిమాల్లోకే వెళ్తుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా చేరుతుంటారు. మరికొందరు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. అయితే సెలబ్రిటీల పిల్లలు ఆర్మీలోకి వెళ్తారా?. అంటే చాలా మంది నో అనే సమాధానం చెప్తారు. కానీ స్టార్ డమ్ ఉన్న ఓ నటుడి కుమార్తె మాత్రం ఆర్మీలో చేరింది. తాను ఎన్నో సినిమాలో విలన్ గా నటించిన.. కుమార్తెను మాత్రం ఆర్మీలో జాయిన్ చేసి రీయల్ హీరో అనిపించుకున్నారు. ఆ నటుడు కుమార్తె చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి.. ఆ నటుడు ఎవరు?, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లు అర్జున్ హీరోగా, సురేందర్ రెడ్డి తెరకెక్కించిన రేసుగుర్రం సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో మద్దాలి శివారెడ్డి అనే టఫ్ విలన్ పాత్రతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు భోజ్ పురి నటుడు, ఎంపీ రవికిషన్. ఈ సినిమా తరువాత చాలా తెలుగు సినిమాల్లో రవి కిషన్ నటించారు. రవికిషన్ ప్రస్తుతం గోరఖ్‌పూర్ ఎంపీగా ఉన్నారు. ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే.. మరొక వైపు ప్రజలకు సేవ చేస్తున్నారు. సినిమాలోనే కాక, ఓ ప్రజాప్రతినిధిగా రవి కిషన్ కి ప్రజల్లో మంచి పేరు ఉంది.
ఇక తాజాగా రవి కిషన్ కూతురుకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రవికిషన్ కుమార్తె ఇషితా శుక్లా ఆర్మీలో చేరింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ అనే ఆర్మీ రిక్రూట్ మెంట్ గురించి అందరికి తెలిసిందే. ఈ అగ్నిపథ్ స్కీమ్ లో భాగంగా ఇషిత ఆర్మీకి ఎంపికైంది. ఇప్పటి వరకు శిక్షణలో ఉన్న ఆమె., ఇక నేటితో ట్రైనింగ్ ను పూర్తిచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రవికిషన్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇషితా శుక్ల వయస్సు కేవలం మాత్రమే.
అయితే ఇంత చిన్న వయస్సులోనే దేశాన్ని కాపాడే సైనికురాలిగా ఆమె మారడంత అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తండ్రి బాటలో సినిమాల్లోకి గానీ, రాజకీయాల్లోకి కానీ వెళ్లకుండా ఆర్మీలోకి చేరడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సినీ,రాజకీయ రంగాల జోలికిపోకుండా యోధురాలిగా మారిన ఇషితాను అభిమానులు ప్రశంసిస్తున్నారు. కేవలం తన తండ్రికే కాకుండా దేశానికి కూడా మంచి పేరు తెచ్చవంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఎంతోమంది యువత ఇషితా ఆదర్శమని.. ఆమెను అలా పెంచినందుకు రవికిషన్ పై కూడా అభిమానులు, నెటిజన్లు ప్రశంస వర్షం కురిపిస్తోన్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.