iDreamPost
android-app
ios-app

షర్మిలకు కారును బహుమతిగా ఇచ్చిన కమల్ హాసన్!

షర్మిలకు కారును బహుమతిగా ఇచ్చిన కమల్ హాసన్!

కోలీవుడ్ స్టార్ హీరో, లోక నాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది అభిమానులు ఆయన సొంతం. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ కమల్ హీరోనే. ఎంతో మంది పేదలకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం  చేస్తారు. తాజాగా మరోసారి   కమల్ హాసన్.. తన మంచి మనస్సును చాటుకున్నాడు.  షర్మిల అనే యువతికి కారును బహుమతిగా  ఇచ్చాడు. మరి..  ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

తమినాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన షర్మిల అనే యువతి బస్సు నడిపిన తొలి మహిళ డ్రైవర్ గా గుర్తింపు పొందిన విషయం అందరికి తెలిసిందే. ఆమెను ఓ ప్రైవేటు  బస్సు సంస్థ డ్రైవర్ గా విధుల్లో పెట్టుకుంది. ఇక బస్సును నడుపుతున్న షర్మిలను చూసి.. ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు అభినందించారు. స్థానిక ప్రజలు, బస్సులోని ప్రయాణికులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపించారు. అలానే గత శుక్రవారం డీఎంకే లీడర్, ఎంపీ కనిమొళి కూడ షర్మిల నడిపే బస్సులోప్రయాణించారు. ఈ సందర్భంగా ఆ  యువతిని కనిమొళి అభినందించారు. ఈ సందర్భంగా  ఆ బస్సు కండక్టర్ కి  షర్మిలకు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే షర్మిల.. కండక్టర్ పై యాజమాన్యంకి ఫిర్యాదు చేసింది. అయితే అనూహ్యంగా షర్మిలానే సదరు యాజమాన్యం ఉద్యోగంలో నుంచి తొలగించిందని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై సదరు బస్సు యజమాని స్పందిస్తూ.. బస్సులో జరిగిన గొడవపై షర్మిలను మందలించానని, దీంతో ఆమె తన ఉద్యోగానికి రాజీమా చేసి వెళ్లిపోయిందని  తెలిపారు. ప్రముఖలను ఆహ్వానిస్తూ ప్రయాణికులకు అసౌకర్యంగా కలిగిస్తుందనే కారణంతో యాజమాన్యం ఆమెను తొలగించగదనే వార్త ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్.. షర్మిలకు కారును బహుమతిగా అందించారు. కమల్ హాసన్ ఇచ్చిన సడెన్ సర్ ప్రైజ్ కి షర్మిల ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. మరి.. కమల్ చేసిన ఈ సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş