iDreamPost
iDreamPost
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆచార్య ఫస్ట్ లుక్ ని మోషన్ పోస్టర్ రూపంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ముందే ప్రకటించిన ప్రకారం 4 గంటలకు విడుదల చేశారు. లాక్ డౌన్ వల్ల ఆరు నెలలుగా షూటింగ్ ఆగిపోయిన ఆచార్య త్వరలో రీ స్టార్ట్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పుడీ పోస్టర్లోని లుక్ ని బట్టి చూస్తే చిరు చాలా పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్న క్లారిటీ అయితే వచ్చేసింది. అనగనగా ధర్మస్థలి అనే ఊరు. ఏదో గుళ్లకు ప్రసిద్ధి గాంచిన గ్రామంలా ఉంది. అక్కడ జరుగుతున్న అక్రమాలను ఎదిరించేందుకు వస్తాడు ఆచార్య.
ఎర్ర తువాలు కట్టుకుని జనం చూస్తుండగా రౌడీలను ఊచకోత కోసి చేతిలో కత్తిని పట్టుకున్న తీరు చూస్తుంటే మాస్ కి గూస్ బంప్స్ ఖాయం అనిపించేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో మణిశర్మ స్కోర్ ఎక్కువ సౌండ్ లేకుండా చాలా నర్మగర్భంగా సబ్జెక్టు ఎంత సీరియసో చెప్పకనే చెబుతోంది. చేసిన నాలుగు సినిమాలతో బ్లాక్ బస్టర్ ట్రాక్ రికార్డు మైంటైన్ చేస్తున్న కొరటాల శివ ఆచార్య దర్శకుడు కావడం అంచనాలను పెంచుతోంది. దానికి తోడు చాలా ఏళ్ళ తర్వాత మెగాస్టార్ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించడంతో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మూవీ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటిదాకా నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్య వచ్చే సంక్రాంతికి విడుదల కావడం లేదు. ఒకవేళ దసరా నుంచి షూట్ ని కంటిన్యూ చేసినా రామ్ చరణ్ ఇచ్చే డేట్స్ ని బట్టి ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ వస్తుంది. వీడియోలో మాత్రం సమ్మర్ 2021 అని చెప్పేశారు. ఇందులో చరణ్ అరగంటకు పైగా కనిపించే స్పెషల్ క్యామియో చేస్తున్నస్ సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ డేట్స్ ని బట్టి దీనికి సర్దుబాటు చేయబోతున్నారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇంకా సెట్స్ లోకి అడుగు పెట్టలేదు. త్వరలో ప్రారంభించబోయే షెడ్యూల్ లో తన రోల్ ఎంటరవుతుంది. ఇప్పటికే రెండు పాటలు, ఫస్ట్ హాఫ్ ఫైట్లు పూర్తి చేసుకున్న ఆచార్య కు ఇంకా చాలా బ్యాలన్స్ ఉంది. చిరంజీవి మొహం పూర్తిగా చూపించకపోవడం నిరాశ కలిగించినా టీజర్ కోసం దాచి పెట్టరేమో చూడాలి.
Motion Poster Link @ https://bit.ly/34orMis