ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

  • Published - 09:08 AM, Tue - 17 March 20
ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో పెనుదుమారం రేపిన ఓటుకు కోట్లు కేసులో హైదరాబాద్ ఏసీబీ కోర్టు మంగళవారం విచారణ కొనసాగించింది. మంగళవారం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను ఏప్రిల్‌ 20 కి వాయిదా వేసింది.

కేసులో ఏ-2 నిందితుడిగా ఉన్నసెబాస్టియన్‌ మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. ఆనంతరం మీడియాతో మాట్లాడిన సెబాష్టియన్ తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి అసలు దోషులను వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణ ఉందని, రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో తెలుగుదేశం తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించిందని సెబాస్టియన్ ఆవేదన వ్యక్తం చేశారు.

కేసులో ఆడియో టేపుల ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌పై విచారణ జరిగితే ఈ కేసు వెనకున్న అసలు సూత్రధారి, అతనితో పాటే కొందరు కీలక వ్యక్తులు బయటకి వస్తారని సెబాస్టియన్ తెలిపారు. తానూ నిజనిజాలన్ని కోర్టుకు తెలిపేందుకు సిద్ధంగా వున్నానని, అయితే ఈ కేసులో తనకు నిందితుల నుండి ప్రాణహాని ఉందని సబాస్టియన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Show comments