iDreamPost
android-app
ios-app

కోర్టుకు హాజరైన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

కోర్టుకు హాజరైన ఆంధ్రజ్యోతి  రాధాకృష్ణ

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కోర్టు గడప తొక్కారు. పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరవకుండా తప్పించుకుంటున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎట్టకేలకు కోర్టు ముందు హాజరయ్యారు. గతేడాది కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం వ్యాజ్యం దాఖలైంది. నిరాధారమైన వార్తలు రాశారంటూ స్థానికుడైన ఎం.సైదేశ్వరరావు పరువు నష్టం వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాన్ని విచారించిన జగ్గయ్యపేట కోర్టు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్‌ శ్రీనివాస్‌లు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే వారు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. రాధాకృష్ణను అరెస్ట్‌ చేసి కోర్టు ముందు హాజరుపరడంపై స్థానిక పోలీసులు తాత్సారం చేశారు.

Read Also : స్థానిక సంస్థల్లో పొత్తుల కోసం బాబు ఆరాటం

పోలీసులు తాత్సారం చేస్తున్న విషయాన్ని పిటిషనర్‌ గత నెల 17వ తేదీన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాధాకృష్ణ, ఎడిటర్‌ శ్రీనివాస్‌లు హాజరుకాకపోవడం, పోలీసులు తాత్సారం చేస్తుండడంతో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వారిరువురికి అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసేందుకు పోలీసులతో సంబంధం లేకుండా అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమిస్తూ గత నెల 17న న్యాయమూర్తి షేక్‌ రెహనా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తప్పని సరి పరిస్థితుల్లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ రోజు శుక్రవారం జగ్గయ్యపేట కోర్టుకు హాజరయ్యారు.