iDreamPost

బిగ్‌ అలర్ట్‌.. జూన్ 14 తర్వాత వారి ఆధార్ కార్డులు పనిచేయవా? UIDAI ఏం చెప్పిందంటే?

  • Published May 27, 2024 | 7:11 PMUpdated May 27, 2024 | 7:11 PM

గత కొన్ని రోజులుగా ఆధార్‌ కార్డు పై ఆధార్ కార్డుకు సంబంధించి ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే జూన్ 14 లోపు ఆధార్ కార్డు వివరాల్ని అప్డేట్ చేసుకోకుపోతే కార్డు పనిచేయవు అని నెట్టింట వైరలు అవుతుంది. కాగా, ఇది నిజమేనా? ఆలోపు అప్డేట్ చేసుకోకుంటే ఆధార్ కార్డులు పనిచేయవా? దీనిపై UIDAI ఇలా వివరణ ఇచ్చింది.

గత కొన్ని రోజులుగా ఆధార్‌ కార్డు పై ఆధార్ కార్డుకు సంబంధించి ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే జూన్ 14 లోపు ఆధార్ కార్డు వివరాల్ని అప్డేట్ చేసుకోకుపోతే కార్డు పనిచేయవు అని నెట్టింట వైరలు అవుతుంది. కాగా, ఇది నిజమేనా? ఆలోపు అప్డేట్ చేసుకోకుంటే ఆధార్ కార్డులు పనిచేయవా? దీనిపై UIDAI ఇలా వివరణ ఇచ్చింది.

  • Published May 27, 2024 | 7:11 PMUpdated May 27, 2024 | 7:11 PM
బిగ్‌ అలర్ట్‌.. జూన్ 14 తర్వాత వారి ఆధార్ కార్డులు పనిచేయవా? UIDAI ఏం చెప్పిందంటే?

ప్రస్తుత కాలంలో దేశంలో ఉన్న ప్రతి భారతీయులకు ఆధార్‌ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే.. ఈ ఆధార్‌ కార్డు ఎంతో ముఖ్యమైన ధృవపత్రంగా మారిందో అందరికి తెలిసిదే. పైగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ స్కీమ్స్‌కు అయిన మరి ఏ ఇతర అవసరాలకైనా సరే  ఆధార్‌ కార్డు ఒక గుర్తింపు కార్డుగా పనిచేస​ఉతంది. అలాగే అడ్రస్ ప్రూఫ్‌గానూ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకోసం ప్రతిఒక్కరికి ఆధార్‌ కార్డు అనేది తప్పనిసరిఆ ఉండాలి. మరి అలాంటి ఆధార్‌ కార‍్డుకు సంబంధించి ఇప్పుడు నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా.. జూన​ 14 లోపు ఆధార్‌ కార్డులో  వివరాల్ని అప్టేట్‌ చేసుకోకుంటే.. అవి పనిచేయవని వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి, ఆ వార్తల్లో ఎంత నిజమేనా? ఆధార్‌ కార్డు అప్డేట్‌ చేసుకోకుంటే పనిచేయవా? అనే విషయాలపై UIDAI ఏ వివరణ ఇచ్చిందో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలోని ప్రతి భారతీయులకు ఎంత ముఖ్యమైన ధృవపత్రమో అందరికి తెలిసిదే. మరి అలాంటి గుర్తింపు కార్డులో పేరు, పుట్టిన తేదీ సహా ఏదీ తప్పుల్లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ, ఇప్పుడు ఈ ఆధార్‌ కార్డు పై సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. పైగా జూన్ 14 లోపు వ్యక్తిగత వివరాలు అప్డేట్ చేయకుంటే.. ఆధార్ కార్డు పనిచేయదని వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం దీనిపైనే తెగ చర్చలు నడుస్తున్నాయి. అయితే దీనిపై వస్తున్న వార్తలపై తాజాగా  భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కొట్టిపారేసింది. కానీ, ఆధార్ కార్డుకు సంబంధించి ఏదైనా ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు మాత్రమే జూన్ 14 ఆఖరి తేదీ అని తెలిపింది. ఒకవేళ మార్చుకోపోయినప్పటికీ ఆధార్ కార్డు యథావిధిగా పనిచేస్తుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ఆధార్‌ కు సంబంధించి వివరాలను ఎప్పుడైనా మార్చుకోవచ్చని తెలిపింది. అయితే అందుకోసం దీని కోసం ఆధార్ కేంద్రాలు లేదా కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి నిర్దేశిత రుసుము చెల్లించాల్సి ఉంటుందని వివరించింది.

ఇక ఆధార్ కార్డు ఫ్రీగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు జూన్ 14 దగ్గర పడుతున్న నేపథ్యంలోనే.. ఈ  ఎన్నో వదంతులు పుట్టుకొస్తున్నాయి అని పేర్కొంది. అయితే ఆధార్ కార్డు ఫ్రీ అప్డేట్‌కు సంబంధించి UIDAI పలుమార్లు గడువు పొడిగించుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. కాగా, దీనిని మొదటగా 2023 డిసెంబర్ 14 వరకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత దీనిని మార్చి 14 వరకు ఒకసారి, మళ్లీ 3 నెలలు పొడిగించి తర్వాత జూన్ 14 వరకు చేసింది. అంటే ఆ సమయంలోగా ఆన్‌లైన్లో మైఆధార్ వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ఆధార్ కార్డులో పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి పదేళ్లు పూర్తయి ఇంకా అప్డేట్ చేసుకోని వారు ఉంటే కూడా అప్డేట్ చేసుకోవాలని ఉడాయ్ గతంలో సూచించింది. ఇది ఆదేశం మాత్రం కాదు. ఏదైనా వివరాలు మారి ఉంటాయి ఇన్నేళ్లలో కాబట్టి అప్డేట్ చేసుకోమని చెప్పిందన్నమాట.

అనగా.. కనీసం 10 సంవత్సరాలకు ఒకసారి గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్ సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధి లోని డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలని ఉడాయ్ పేర్కొంది. ఇక ఈ ప్రాసెస్ వల్ల పౌరుల సమాచారం CIDR వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుందని వివరించింది. దీంతో కచ్చితమైన సమాచారం నిక్షిప్తం అయ్యేందుకు దోహదం చేస్తుందని తెలిపింది. అయితే ఈ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఉడాయ్ వెబ్‌సైట్లోకి లాగిన్ అయ్యాక.. లేటెస్ట్ గుర్తింపు కార్డు, అడ్రస్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ వంటివి గుర్తింపు, అడ్రస్ రెండింటి కోసం ప్రూఫ్స్‌గా వినియోగించుకోవచ్చు. వీటితో పాటు TC, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, మార్కు షీట్ వంటివి గుర్తింపు కార్డుగా, కరెంట్, వాటర్, టెలిఫోన్ బిల్స్ అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. మరి, ఆధార్‌ అప్డేట్‌ ల పై వస్తున్న రూమర్స్‌ పై UIDAI ఇచ్చిన వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి