SNP
Assam, Silchar, National News: కనీసం 20 నెలలు కూడా నిండని ఓ పసిబిడ్డకు సిగరేట్, మద్యం తాగించిందో తల్లి. ఆమె అలా ఎందుకు చేసింది? ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Assam, Silchar, National News: కనీసం 20 నెలలు కూడా నిండని ఓ పసిబిడ్డకు సిగరేట్, మద్యం తాగించిందో తల్లి. ఆమె అలా ఎందుకు చేసింది? ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
పసిపిల్లలకు ఎవరైనా పాలు తాగిస్తారు, ఉగ్గు తినిపిస్తారు.. కానీ, ఈ మహాతల్లి సిగరేట్లు, మద్యం తాగించింది. ఈ ఘటన అస్సాంలో వెలుగుచూసింది. సిల్చార్‌కు చెందిన ఓ మహిళ తన 20 నెలల పసిపాపకు బలవంతంగా సిగరేట్, మద్యం తాగించింది. భయంకరమైన ఈ దృశ్యాలు చూసిన స్థానికులు చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి అక్కడ జరుగుతున్నది చూసి ఖంగుతిన్నారు. వెంటనే బిడ్డను ఆమె నుంచి లాక్కొని.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ వికృత చేష్టలకు పాల్పడిన ఆ పాప తల్లిని తదుపరి విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం తల్లి, బిడ్డ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలో ఉన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిన తర్వాత చర్యలు తీసుకోనున్నారు. అయితే.. ఈ ఘటన జూన్ 12న జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆమె తల్లేనా? లేదా ఆమెకు పిచ్చి పట్టిందా? అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ బిడ్డను రక్షించి.. ఎవరికైనా దత్తత ఇవ్వాలంటూ కోరుతున్నారు. ఇలాంటి ఘటనలతో అమ్మతనం తలదించుకునేలా చేస్తున్నాయంటూ మండిపడుతున్నారు.
అయితే.. ఆ మహిళ ఇలా ఎందుకు చేసిందనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ఆమె మానసిక పరిస్థితి బాగా లేదా? లేక కావాలనే బిడ్డను హింసిస్తోందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ విషయంపై ముందు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత.. ఒక వేళ మానసిక స్థితి బాగానే ఉండి, కావాలనే ఇదంతా చేసి ఉంటే.. ఆమెకు శిక్ష పడే అవకాశం ఉంది. మరి పట్టుమని 20 నెలలు కూడా నిండని పసిబిడ్డకు సిగరేట్, మద్యం తాగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
In an absolutely disturbing incident, a woman has been found to allegedly force her 20-month-old child to smoke cigarettes and even drink alcohol. The incident took place in the Chengkuri area of Silchar on Wednesday night.
The Child Helpline Cell received a complaint with… pic.twitter.com/fwPZ593pts— ForMenIndia (@ForMenIndia_) June 15, 2024