iDreamPost
android-app
ios-app

Nandamuri Balakrishna : ట్రెండ్ సెట్టింగ్ టైటిల్ తో బాలకృష్ణ ?

Nandamuri Balakrishna : ట్రెండ్ సెట్టింగ్ టైటిల్ తో బాలకృష్ణ ?

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. బాలకృష్ణ శృతి హాసన్ జంటగా రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే శుభమా అని చిత్రీకరణ మొదలుపెట్టిన రోజే కీలకమైన బాలయ్య గెటప్ తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో లీకైపోవడం అభిమానులను షాక్ కు గురి చేసింది. ఇటీవలి కాలంలో మైత్రి తాలూకు లీక్స్ బాగా ఎక్కువవుతున్నాయి. కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదనే కామెంట్స్ ఉన్నాయి.

అయితే ఆ గెటప్ చూసినవాళ్లకు 2017లో వచ్చిన కన్నడ సూపర్ హిట్ మూవీ మఫ్టీ గుర్తుకురావడంతో అందరూ దాని రీమేక్ ఏమో అనుకుంటున్నారు. ఆ చొక్కా పంచెకట్టు అలా ఉన్న మాట వాస్తవమే కానీ నిజానికిది వేరే స్టోరీ అని సమాచారం. మఫ్టీలో శివ రాజ్ కుమార్ హీరో. అతనితో పాటు మరో యూత్ హీరోకు పవర్ ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది. ఒకరకంగా మల్టీ స్టారర్ అన్నమాట. కానీ బాలయ్య చిత్రానికి అలాంటి కాంబినేషన్ ఏమి సెట్ చేయలేదు. సో పక్కాగా రీమేక్ కాదని చెప్పొచ్చు. పైదంతా ప్రచారమే. దసరాను టార్గెట్ చేసుకున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా గోపీచంద్ మలినేని ప్లానింగ్ తో ఉన్నారు.

ఇక దీని టైటిల్ కు సంబందించిన లీక్ కూడా చక్కర్లు కొడుతోంది. ఇందులో ఆయన పేరు వీరసింహారెడ్డి. సో దాన్నే పెట్టేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు కూడా జరుగుతున్నాయట. టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయిన సమరసింహారెడ్డి తర్వాత రెడ్డి పేరుతో బాలయ్య చెప్పుకోదగ్గ సినిమాలే చేశారు. చెన్నకేశవరెడ్డితో పాటు ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన నరసింహనాయుడు లాంటివి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాయి. అలాంటి టైటిల్ ని సెట్ చేయడం కన్నా ఫాన్స్ కి కావాల్సింది ఏముంటుంది. ఇదయ్యాక బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమా జులై లేదా ఆగస్ట్ మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఇవాళ సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డ్ డేట్ మైత్రి సంస్థ విడుదల చేయనుంది.

Also Read : Movie Collections : ఇంత నీరసమైన శుక్రవారం మళ్ళీ రాదేమో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి