iDreamPost
iDreamPost
బ్రిటన్ లో దొంగిలించబడిన బెంట్లీ సెడాన్ పాకిస్తాన్‌లో సింధ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ పట్టుకుంది.
ఇది అవమానకరమని పాకిస్తాన్ నెట్ జెన్స్ తెగ ఫీలవుతున్నారు. అసలు బ్రిటన్ లో దొంగిలించిన కారును ఎలా పాక్ కు రవాణా చేస్తారని ఆశ్చర్యపోతున్నారు. ఇది అంతర్జాతీయంగా పాక్ పరువుతును తీసినట్లుగా ఆగ్రహిస్తున్నారు.
బ్రిటన్ నుంచి అక్రమంగా తరలిస్తున్న బెంట్లీ ముల్సాన్ కారును కరాచీ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ శనివారం స్వాధీనం చేసుకుంది. ట్రాకింగ్ పరికరాన్ని ఉపయోగించి బెంట్లీ కారు ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన UK నేషనల్ క్రైమ్ ఏజెన్సీ పాక్ కు ఫిర్యాదు చేసింది. అదిసరే, బ్రిటన్ లో దొంగిలించిన కారును ఎలా పాక్ కి ఎలా తీసుకొచ్చారు? ఇక్కడ ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? చట్టపరమైన ఫార్మాలిటీలను పాటించకుండా దొంగిలించబడిన కారుకు రిజిస్ట్రేషన్ చేసినందుకు అధికారులు తలపట్టుకున్నారు.
ఖరీదైన విదేశీ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి, పాకిస్తాన్ కస్టమ్స్ నుండి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ , కొన్నట్లు సర్టిఫికేట్ అవసరమని కరాచీ కలెక్టరేట్ ఆఫ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (సిసిఇ) అంటోంది. మరి ఆ సర్టిఫికెట్స్ లేకుండా ఎలా విదేశీ కారును ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? పాక్ అంతటి అవినీతి ఉందా?
కస్టమ్స్ అధికారులు రంగంలోకి దిగారు. కూపీలాగారు. ఈ దందాలో జర్నలిస్ట్ ఒమర్ ఆర్ ఖురైషీకూడా ఉన్నాడంట. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. ఇలా స్మగ్లింగ్ చేసిన విదేశీ కార్లను పాక్ లో రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఆ దేశానికి 30కోట్ల మేర నష్టమొచ్చింది.
దొంగిలించిన బెంట్లీ కారును ఒక బ్రోకర్ నకిలీ పత్రాలను చూపించి, మంచి రేటుకు జమీల్ షఫీ అనే వ్యక్తికి అమ్మేశాడు. ఇప్పుడు అతను పరారీలో ఉన్నాడు. రేటు బాగుందని బెంట్లీ కొన్న యజమాని ఇప్పుడు కేసులో ఇరుక్కున్నాడు.
Custom authorities in Pakistan have seized a Bentley from a house in Karachi – customs officials say it was stolen from London – its value has been assessed at Rs 58 million and Rs 307 million in duties and taxes were due on it pic.twitter.com/8hQnyrTYDM
— omar r quraishi (@omar_quraishi) September 3, 2022