iDreamPost
iDreamPost
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక సెల్ఫీ వైరల్ అవుతుంది. రెండు వేర్వేరు రైళ్లలో ఉన్న ఇద్దరు రైల్వే ఉద్యోగులు తీసుకున్న సెల్ఫీ అది. అయితే ఇందులో స్పెషల్ ఏముంది అని ఆలోచిస్తున్నారా? ఈ సెల్ఫీలో ఉన్న వారిద్దరూ తండ్రీకొడుకులు. తండ్రి ఎప్పట్నుంచో రైల్వే గార్డుగా పని చేస్తుండగా ఇటీవలే అతని కొడుకు ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)గా ఉద్యోగంలో చేరాడు.
ఇద్దరూ చేసేది రైల్వే ఉద్యోగమే అయినా డ్యూటీలు వేరు, వారి హోదాలు వేరు. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి తిరగాల్సి ఉంటుంది. డ్యూటీ దిగాక ఎప్పుడో ఇంట్లో కలుస్తారు. అయితే ఒకరోజు విధుల్లో ఉండగా వీరిద్దరు డ్యూటీలో ఉన్న రెండు రైళ్లు ఒకేచోట పక్క పక్క పట్టాల మీద ఆగాయి. దీంతో తండ్రి కొడుకులు ఒకర్నొకరు చూసి ఆనందించారు. అప్పుడు కొడుకు సరదాగా తండ్రితో ఇలా సెల్ఫీ దిగాడు.
ఆ సెల్ఫీని ఓ వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. ఈ ఫోటోని.. అద్భుతమైన సెల్ఫీ. రైల్వేలో తండ్రి గార్డు.. కొడుకు టీటీఈ. రెండు రైళ్లు పక్కపక్కనే ఆగడంతో తీసుకున్న సెల్ఫీ ఇది అంటూ పోస్ట్ చేసాడు. ఈ ఫొటోలో ఇద్దరూ యూనీఫామ్ ధరించి వేర్వేరు రైలులో ఉండగా ఫోటో తీసుకున్నారు. అయితే ఇది ఎక్కడ, వారి పూర్తి వివరాలు ఏంటి అనేది తెలీదు. కానీ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.
अजब ग़ज़ब सेल्फ़ी
पिता रेलवे में गार्ड है और बेटा टीटी है । जब दोनो की ट्रेन अगल-बग़ल से गुजरी तो एक सेल्फ़ी का लम्हा बन गया ❤️ pic.twitter.com/Zd2lGHn7z3
— Suresh Kumar (@Suresh__dhaka29) June 15, 2022