iDreamPost
android-app
ios-app

పేరుకే పోలీస్.. కానీ ప్రేమించానని చెప్పి ఓ యువతిని గర్భవతి చేసిన ఘనుడు..

  • Published Jun 05, 2022 | 8:45 AM Updated Updated Jun 05, 2022 | 8:45 AM
  • Published Jun 05, 2022 | 8:45 AMUpdated Jun 05, 2022 | 8:45 AM
పేరుకే పోలీస్.. కానీ ప్రేమించానని చెప్పి ఓ యువతిని గర్భవతి చేసిన ఘనుడు..

ప్రజలని రక్షించాల్సిన పోలీస్ అధికారే ఓ యువతిని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. విజయనగరం జిల్లా మిర్తివలస గ్రామానికి చెందిన సువ్వాడ ఉషారాణి అదే గ్రామానికి చెందిన పొట్నూరు గోపాలకృష్ణ 2019 నుంచి ప్రేమించుకుంటున్నారు. గోపాలకృష్ణ హైదరాబాద్‌ సెంట్రల్‌ పోలీస్‌ లైన్స్‌లో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు.

మొదటిసారి 2020లో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో గ్రామపెద్దల వద్ద పంచాయితీ పెట్టారు. గోపాలకృష్ణ నుంచి కొంత డబ్బుని ఉషారాణికి ఇప్పించి రాజీ కుదిర్చారు గ్రామ పెద్దలు. అయితే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇద్దరూ ఒక్కటయ్యారు. గోపాలకృష్ణ డిప్యుటేషన్‌పై విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అప్పుడప్పుడూ తన గ్రామానికి వచ్చి ఉషారాణితో గడిపేవాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి అయింది.

దీంతో ఉషారాణి పెళ్లి చేసుకోవాలని గోపాలకృష్ణపై ఒత్తిడి తీసుకువచ్చింది. కానీ గోపాలకృష్ణ మొహం చాటేసి అప్పట్నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. గోపాలకృష్ణ తనని గర్భవతి చేసి పెళ్లికి నిరాకరించడంతో న్యాయం చేయాలని బాధితురాలు విజయనగరం హ్యూమన్‌ రైట్స్‌ సభ్యులను ఆశ్రయించింది. ఆ తర్వాత గ్రామ పెద్దలతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom