ఓటుకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అందరికి తెలుసు. అయితే మన ఒక్క ఓటుతోనే రాతలు మారుతాయా? అని అనుకునే వారు ఎక్కువ మంది ఉన్నారు. ఓటు విలువ తెలిసిన వారు మాత్రం ఆ హక్కును కచ్చితంగా వినియోగించుకుంటున్నారు. చాలా మంది ఒక్క ఓటే కదా అని చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ, ఆ ఒక్క ఓటే గెలుపోటములను నిర్ణయిస్తుంది. అలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. అందుకే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలక్షన్ కమిషన్ ప్రచారాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది తమ ఓటును ఓటర్ జాబితాల్లో చేర్చుకుని, ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ 93 ఏళ్ల వృద్ధుడు మాత్రం అందరిని ఆశ్చర్యానికి కలింగేచాలా వార్తాల్లో నిలిచాడు. తొమ్మిది పదుల వయస్సులో తొలిసారి ఓటు హక్కు వినియోగింకోనున్నాడు. మరి.. ఇంతకాలం ఎందుకు వేయలేదు?. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మరికొన్ని నెలల్లో తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లకు కసరత్తులు చేస్తోంది. అతి త్వరలో ఈ ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్దమవుతుంది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఛత్తీస్ గఢ్ లో కూడా ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఈ రాష్ట్రంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టు ప్రభావిత జిల్లా కాంకర్ లోని బైంసాకన్హర్ గ్రామంలో 93 ఏళ్ల వృద్ధుడు తొలిసారి ఓటును నమోదు చేసుకున్నారు. దీంతో ఆయన త్వరలో ఆ రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఓటుహక్కను వినియోగించుకోనున్నారు. అసలు ఇంతకాలం ఆయన ఎందుకు ఓటు హక్కు వినియోగించుకోలేదో ఎవరి అర్ధం కాలేదు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికారులు ఇంటింటికి వెళ్లి అర్హులై ఉండి, ఓటర్ల జాబితాలో లేని వారిని చేర్చేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రచారంలో భాగంగా అధికారులు 93 ఏళ్ల షేర్ సింగ్ హెడ్కో ఇంటికి వెళ్లారు. ఆయన వివరాలు తెలుసుకుని, ఇంతవరకు ఓటు హక్కును వినియోగించుకోక పోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు ఇంతకాలం ఓటు వేయలేదని షేర్ సింగ్ ను అధికారులు ప్రశ్నించారు. సింగ్ సిమర్పించిన పత్రాల్లోని లోపాల వల్లే ఇంతకాలం ఆయన పేరు ఓటరు జాబితాలో చేరలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అన్ని ప్రక్రియలు పూర్తి చేసి షేర్ సింగ్ పేరును ఓటర్ల జాబితాలో చేర్చారు. దీంతో త్వరలో 93 ఏళ్ల వయస్సులో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.