iDreamPost

సుప్రీంకోర్టులో తొలిసారిగా సైగలతో వాదనలు చేసిన మహిళా న్యాయవాది

సుప్రీంకోర్టులో తొలిసారిగా సైగలతో వాదనలు చేసిన మహిళా న్యాయవాది

సుప్రీంకోర్టు మరోసారి చరిత్రలో నిలిచిపోయే సాక్ష్యానికి కేంద్ర బిందువైంది. ఇటీవల కాలంలో దేశ అత్యున్నత న్యాయ స్థానంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి విదితమే. ఏళ్ల తరబడి నలుగుతున్న పలు వివాదాలు పరిష్కారం అయినట్లే.. నూతన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. విచారణ పర్వాన్ని అందరూ తిలకించేలా లైవ్‌ వీడియోను తీసుకువచ్చింది. ఇప్పుడు మరో అద్భుతానికి నాంది పలికింది. తొలిసారిగా వినికిడి లోపం ఉన్న న్యాయవాది వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించింది. కేవలం తన సైగలతోనే విచారణ చేపట్టింది ఆ మహిళా న్యాయవాది. ఆమె పేరు సారా సన్నీ. కేరళకు చెందిన సారా సన్నీ అనే వినికిడి లోపం ఉన్న మహిళా న్యాయవాది సుప్రీంకోర్టులో ఓ కేసుకు సంబంధించి వర్చువల్ విధానంలో తొలిసారిగా వాదనలు చేయడం విశేషం.

వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న విచారణకు తొలుత కంట్రోల్ రూమ్ ఆమెను తెరపై కనిపించేందుకు అనుమతి నిరాకరించింది. అయితే సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది సంచితా ఐన్ ప్రమేయంతో ఆమెకు అవకాశం కల్పించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్ర చూడ్ .  వాదనలు చేసేందుకు సీజేఐ చంద్ర చూడ్.. ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సన్నీకి స్క్రీన్ స్పేస్ ఇవ్వాలని జస్టిస్ చంద్ర చూడ్ కంట్రోల్ రూమ్, ఇంటర్ ప్రెటర్‌ను ఆదేశించారు. సారా.. సంచినా ఐన్ వద్ద జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమె చేసే సైగలను అనువాదకుడు సౌరభ్ రాయ్ చౌదరి వారికి వివరించారు. తనకు అవకాశం కల్పించిన ప్రధాన న్యాయమూర్తికి ధన్యవాదాలు తెలిపారు సారా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి