iDreamPost
iDreamPost
నిన్న నాని శ్యామ్ సింగ రాయ్ తో పాటుగా విడుదలైన సినిమా 83. బాలీవుడ్ మూవీనే అయినప్పటికీ తెలుగు వెర్షన్ కూడా డబ్బింగ్ రూపంలో రిలీజ్ చేశారు నిర్మాతలు. అంతే కాదు త్రిడి ఫార్మాట్ లో వచ్చిన మొదటి ఇండియన్ స్పోర్ట్స్ డ్రామాగా 83కి మరో ప్రత్యేకత ఉంది. ఇప్పటి తరహానికి ధోని గెలిచిన వరల్డ్ కప్ గురించి మాత్రమే అవగాహన ఉంటుంది. కానీ కపిల్ దేవ్ నేతృత్వంలో ముప్పై ఎనిమిదేళ్ల క్రితం మొదటిసారి మన దేశానికి ఈ ఘనత దక్కడం అప్పటి యూత్ జ్ఞాపకాల్లో ఇంకా సజీవంగానే ఉంది. దాన్ని మరోసారి వెండితెరపై ఆవిష్కరించే మహత్తర ప్రయత్నం చేసింది రిలయన్స్ సంస్థ. మరి ఈ చిత్రం ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.
ఇందులో ప్రత్యేకించి తెలియని కథంటూ ఏదీ లేదు. ప్రపంచ కప్ గెలవడానికి ముందు మన జట్టు ఎదురుకున్న రకరకాల పరిణామాలు, అవమానాలు, సంఘటనలు ఇందులో గంపగుత్తగా చూపించారు. ఎంఎస్ ధోని, సచిన్ మాదిరి ఇది సింగల్ ప్లేయర్ బయోపిక్ కానప్పటికీ కపిల్ దేవ్ ని హై లైట్ చేయడమే ప్రధానంగా సాగింది. అయినా కూడా టీమ్ మెంబెర్స్ మధ్య భావోద్వేగాలు, అప్పటి వాతావరణం, టెక్నాలజీ లేని రోజుల్లో మానవ సంబంధాలు ఎలా ఉండేవని స్పృశించిన కోణం ఇవన్నీ 83లో ఉన్నాయి. అచ్చంగా అప్పటి క్రికెట్ మ్యాచ్ ని మళ్ళీ రీ ప్లే లో చూస్తున్నామా అనేంత సహజంగా చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. ఎమోషన్స్ బాగా వచ్చాయి.
కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ జీవించేశాడు. అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో కట్టిపడేసాడు మిగిలినవాళ్లు కూడా బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చినప్పటికీ కెప్టెన్ కాబట్టి ఫోకస్ తనమీదే ఎక్కువ పడింది. అయితే అవసరానికి మించి కొంత ల్యాగ్, కొన్ని కృత్రిమంగా ఇరికించిన సన్నివేశాలు ఇంపాక్ట్ ని తగ్గించాయి. ఇవి పక్కనపెడితే ఒక భారతీయుడిగా ఛాతి గర్వంతో ఉప్పొంగే మూమెంట్స్ మాత్రం 83లో ఉన్నాయి. క్రికెట్ ప్రేమికులు మాత్రమే వాటిని ఆస్వాదించగలరు. దర్శకుడు కబీర్ ఖాన్ బెస్ట్ ప్రోడక్ట్ ఇచ్చారు. నిడివి వల్ల సగటు ప్రేక్షకులు గొప్పగా కనెక్ట్ అవుతారో లేదో చెప్పలేం కానీ మీకు క్రికెట్ ఇష్టమైతే 83ని మిస్ చేయొద్దు. 3డిలో అంత గొప్పగా లేదు
Also Read :Radhe Shyam : మాస్ ఆడియన్స్ ని మెప్పించడం కీలకం